వ్యవసాయ కూలీ కూతురి ప్రతిభ
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం గాయత్రి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అక్కడి హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి.. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు గాయత్రి ఉన్నారు.
తండ్రి వ్యవ సాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తున్నారు. కూతురిని కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చదివించారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు తొలిసారి హాజరైన గాయత్రి.. అప్పుడు విజయం సాధించలేకపోయారు. పట్టుదలతో చదివిన ఆమె రెండోసారి పరీక్షలు రాసి తన లక్ష్యం సాధించారు. కాగా, మొండయ్య ఇద్దరు కుమారులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment