సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థలో సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఓ న్యాయాధికారి ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో అరెస్టు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనా ర్హం. శనివారం సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.20కోట్లకు పైగా అక్రమ ఆస్తులను ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా మీడియాతో గాంధీ మాట్లాడారు. వ్యక్తిగత కోపంతో బంధువుల్లోని కొందరు అనిశాకు తప్పుడు సమాచారం అందించారన్నారు. తన భార్యకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని సైతం అక్రమాస్తులంటున్నారని పేర్కొన్నారు. మీడియాతో మాట్లడాక ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఏసీబీ అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment