ఆదోనివాసికి రాష్ట్రపతి అవార్డు | adoni citizen got presidant award | Sakshi
Sakshi News home page

ఆదోనివాసికి రాష్ట్రపతి అవార్డు

Published Thu, Sep 15 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ఆదోనివాసికి రాష్ట్రపతి అవార్డు

ఆదోనివాసికి రాష్ట్రపతి అవార్డు

ఆదోని: పట్టణానికి చెందిన సాకరే గచ్చి రమేష్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి రాజ్‌భాషా కీర్తి పురస్కార్‌ అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బంధువులు గురువారం విలేకరులకు తెలిపారు. హావన్న పేటకు చెందిన సాకరే వెంకోబరావు, రాధాబాయి దంపతుల కుమారుడు రమేష్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నాగపూర్‌ శాఖలో సీనియర్‌ మేనేజరుగా పనిచేస్తున్నారు. ఈయన హిందీపై బ్యాంకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. తన విధులు నిర్వహిస్తూనే హిందీ భాషాభివద్ధికి రమేష్‌ చేస్తున్న కషిని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనను జాతీయ అవార్డుతో సత్కరించింది.  హిందీ దివస్‌ను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రమేష్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డు ప్రదానం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement