జెరూసలేం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయెల్ నూతన అధ్యక్షుడు నఫ్టాలి బెన్నెట్‌తో జరిగిన సమావేశంలో బైడెన్ నిద్రపోయారు. ఈ మేరకు ఆ వీడియోలో వెనుక నుంచి నెతాన్యాహు వాయిస్ ఆడియోలో వస్తుంటుంది.
(చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి)
ఆ ఆడియోలో నెతాన్యాహు మాట్లాడుతూ... "మీకు తెలుసా బెన్నెట్ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బైడెన్ శ్రద్ధగా వినడమే కాక తన అంగీకారాన్ని తెలుపడంలో ఊ కొడుతూ తల వాల్చినట్లున్నారు". అని సెటైర్ వేశారు. అమెరికా, దాని మిత్రదేశాలు తీసుకొచ్చిన రెండు(ఇజ్రాయెల్ , పాలస్తీనా) దేశాల పరిష్కార దిశగా చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెన్నెట్ ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సంకీర్ణం ప్రభుత్వ ఏర్పాటుతోపాటు 12 ఏళ్ల కాలంపాటు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన నెతన్యాహు పదవీచ్యుతుడు కావడంతోనే బైడన్ పై తన అక్కసును వెళ్లగక్కారు. అంతేకాదు ఈ ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి.. మళ్లీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తానని నెతన్యాహు గతంలో శపథం చేసిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment