
నేను, సమంత ఆ సినిమా చేయట్లేదు: చైతూ
బాలీవుడ్‌లో విజయవంతమైన రొమాంటిక్ కామెడీ సినిమా ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో తాను నటించడం లేదని యంగ్ హీరో అక్కినేని నాగాచైతన్య స్పష్టం చేశాడు. అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో నాగాచైతన్య, ఆయన కాబోయే భార్య సమంత జంటగా నటిస్తారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్‌లో మీరు జంటగా నటించబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘మేం ఆ సినిమా చేయడం లేదు. మేం కనీసం ఆ సినిమా స్క్రిప్ట్ కూడా వినలేదు. ఇక ఆ సినిమా చేసే ప్రసక్తి ఎక్కడిది’ అని చైతూ తాజాగా తెలిపాడు.
చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్: ద స్టోరీ ఆఫ్ మై మ్యారేజ్’ నవల ఆధారంగా ‘ 2 స్టేట్స్’ సినిమా తెరకెక్కింది. హిందీలో హిట్టయిన ఈ సినిమా హక్కులను ఇటీవల తెలుగులో రీమేక్ చేసేందుకు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రీమేక్‌లో అలరించబోయే జంట ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.