శర్వానంద్
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకులను పలకరిస్తానంటున్నారు శర్వానంద్. సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు సమంత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని తాజా సమాచారం. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో రూపొందుతున్న సినిమా కాబట్టి బహుశా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల ఉంటుందని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment