డబ్బుంటే చాలు... | Sunil's '2 Countries' Set To Release In December! | Sakshi
Sakshi News home page

డబ్బుంటే చాలు...

Published Fri, Nov 10 2017 12:36 AM | Last Updated on Fri, Nov 10 2017 12:36 AM

Sunil's '2 Countries' Set To Release In December!  - Sakshi

ఏ ప్రాబ్లమ్‌ అయినా సరే డబ్బుంటే చాలు సాల్వ్‌ అయిపోతుందని అనుకునే టైప్‌ అతను. ఎంత కన్నింగ్‌లా ఆలోచిస్తాడంటే డబ్బు కోసం పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఆ తర్వాత అతని లైఫ్‌ ఎలా టర్నింగ్‌ తీసుకుంది? అతని ఆలోచనల్లో మార్పు వచ్చిందా? అన్న అంశాలతో మలయాళంలో షఫీ రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్‌’. ఇప్పుడు ఈ చిత్రాన్ని సునీల్‌ కథానాయకుడిగా ఎన్‌. శంకర్‌ తెలుగులో సేమ్‌ టైటిల్‌తో రూపొందించారు. ‘‘2 కంట్రీస్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో సరికొత్త సునీల్‌ని చూడబోతున్నారు.

సునీల్‌కి సరిగ్గా సరిపోయే రోల్‌ ఇది. అమెరికాలో ఎక్కువ శాతం షూటింగ్‌ జరిపాం. షూటింగ్, డబ్బింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ అన్నింటినీ కంప్లీట్‌ చేశాం. వచ్చే వారం ఫస్ట్‌ లుక్‌ను, డిసెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు ఎన్‌. శంకర్‌. షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement