
నాని
బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌పై నాని కన్ను పడిందని ఇండస్ట్రీ టాక్. ‘అంధాధూన్’లో చూపు లేని పాత్ర చేసిన ఆయుష్మాన్ ఖురానాను అన్ని ఇండస్ట్రీలు తొంగి చూశాయి. ఆయుష్మాన్ పెర్ఫార్మెన్స్‌కు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో హీరోగా నాని నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ చిత్రాన్ని శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. మరి తెలుగు చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment