
అల్లు అర్జున్
యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రాల్లోనే కాదు.. మంచి ప్రేమకథా చిత్రాలతోనూ ప్రేక్షకులను మెప్పించగలరు అల్లు అర్జున్. ‘ఆర్య, పరుగు’ సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆయన తమిళంలో మంచి హిట్ అయిన లవ్‌స్టోరీ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ‘96’ సినిమా తెలుగు హక్కులను ఇటీవల నిర్మాత ‘దిల్’రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని వినికిడి.అల్లు అర్జున్ కెరీర్‌కు మంచి ప్లస్ అయిన ‘పరుగు’ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించిన విషయం గుర్తుండే ఉంటుంది. గతేడాది అల్లు అర్జున్–‘దిల్’ రాజు–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రారంభమవుతుందట. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment