శర్వానంద్
కెమెరా పట్టుకుని కెన్యా అడవుల్లో క్లిక్‌మనిపిస్తున్నారు శర్వానంద్. ఎందుకంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారారు శర్వా. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘96’ తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శర్వా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ రూపొందుతోంది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం కెన్యాలో మొదలైంది.
ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగనుంది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా శర్వానంద్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సినిమాలో వైల్డ్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే దృశ్యాల చిత్రీకరణను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నారు. అలాగే ఆ మధ్య మారిషస్‌లో జరిగిన షెడ్యూల్‌లో ఓ సాంగ్‌లో భాగంగా శర్వానంద్ స్కూబా డైవ్ చేశారు. కెన్యా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్, వైజాగ్‌లలో కూడా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. జూలై లోపు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. మహేంద్రన్ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment