
నయనతార చిత్ర దర్శకుడి తాజా చిత్రంలో నటి సమంత నటించబోతున్నారా? ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ వార్త ఇదే. 2019లో విజయపథంలో సాగిన నటి సమంత. తమిళంలో ఈ బ్యూటీ డేర్ చేసి నటించిన చిత్రం సూపర్ డీలక్స్. సమంత అగ్రనటిగా వెలుగొందుతున్న తరుణంలో ఈ చిత్రంలో ఏ నటి నటించడానికి సాహసం చేయని పాత్రలో నటించారు. దీనిపై మొదట్లో విమర్శలు ఎదురైనా, చిత్రం విడుదలై సక్సెస్ అవడంతో పాటు, బాలీవుడ్‌లోనూ రీమేక్ కానుంది.
అంతే కాదు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతోంది. ఇకపోతే తెలుగులో తన భర్తతో కలిసి నటించిన మజిలి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఓ బేబీ చిత్రాన్ని పూర్తి చేశారు. కొరియన్ చిత్ర రీమేక్ అయిన ఈ మూవీలో కొత్త సమంతను చూస్తారని అంటున్న ఈ అమ్మడికి కోలీవుడ్‌లో మరో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం తలుపు తట్టిందనే ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంతకు ముందు నయనతార హీరోయిన్‌గా డోరా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దాస్ రామస్వామి మరో చిత్రానికి రెడీ అయినట్లు సమాచారం. హర్రర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందిన డోరా చిత్రం 2017లో విడుదలై మిశ్రమ టాక్‌నే తెచ్చుకుంది. కాగా దర్శకుడు దాస్ రామస్వామి రెండవ చిత్రానికి హర్రర్ ఇతివృత్తాన్నే ఎంచుకున్నట్లు, ఇందులో నటి సమంతను కథానాయకిగా నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది.
అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఇంతకు ముందు సమంత తెలుగులో రాజుగారి గది 2 హర్రర్ కథా చిత్రంలో నటించారు సమంత. అయితే అది సక్సెస్ కాలేదు. ఇక దాస్ రామస్వామి తెరకెక్కించిన తొలి చిత్రం డోరా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ తమిళంలో ఆయన దర్శకత్వంలో హర్రర్ ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటించడానికి సమ్మతిస్తారా? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం.
Comments
Please login to add a commentAdd a comment