
తిరుమల: ప్రముఖ సినీనటి నయనతార తిరుమలలో గురువారం సందడి చేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డూప్రసాదాలు, చిత్రపటాలతో వేదాఆశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శన అనంతరం నయనతారను చూసేందుకు అభిమానులు ఎగబడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆమెతో పాటు తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఉన్నారు.