
కుంచక్కో బొబన్, నయనతార ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘నిళల్’. ‘నిళల్’ అంటే నీడ అని అర్థం. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇందులో నయనతార పాత్ర ఫుల్ పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలిసింది. ఈ సినిమాలో మిస్టరీను కనుగొనే పాత్రలో నయన కనిపిస్తారట. కేరళలోని కొచ్చి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. నాన్‌స్టాప్‌గా నలభై ఐదు రోజుల చిత్రీకరణతో ఈ సినిమాను ముగించారు. ‘‘సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పాత్రకు లేడీ సూపర్‌స్టార్ నయనతారే కరెక్ట్ అని చిత్రబృందం భావించాం. అనుకున్నట్టుగానే నయనతార తన పాత్రకు న్యాయం చేశారు’’ అన్నారు దర్శకుడు అప్పు ఎన్. బట్టాతిరి.
Comments
Please login to add a commentAdd a comment