
కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి తలంబ్రాలు పోసుకునేందుకు రెడీగా ఉన్నారట. ఈమేరకు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నయన్ ప్రియుడు షేర్ చేసిన ఫొటోనే ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. కాగా విఘ్నేశ్ శివన్ గురువారం ఉదయం ఓ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో నయనతార చేయి అతడి గుండెల మీద ఉండగా ఆమె వేలికి ఉంగరం తొడిగి ఉంది. ఇది చూసిన అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ ప్రేమ పక్షులు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారంటూ కామెంట్లతో ఊదరగొడుతున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ గింగిరాలు తిరుగుతోంది.
కాగా 2015లో 'నానుమ్ రౌడీదాన్' సినిమా సమయంలో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విహారయాత్రలు ప్లాన్ చేస్తూ పనిలో పనిగా పలు దేశాలు కూడా చుట్టొచ్చేశారు. పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీళ్లిద్దరూ మొత్తానికి ఒకింటివారవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి వీరిద్దరూ నిజంగానే ఏడడుగులు వేస్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా వుంటే విఘ్నేశ్ ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చదవండి: ప్రియుడి బర్త్‌డే: నయన్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment