సినిమా: నటి నయనతార కొత్తగా జాగ్వర్ కారు కొన్నది. దానికి డ్రైవర్ ఎవరో తెలుసా? అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఇంతకు ముందు యువ హీరోలను సపోర్ట్‌గా చేసుకుని హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకే అధిక ప్రాముఖ్యతనిస్తూ వచ్చిన ఈ సంచలన నటి ఈ మధ్య స్టార్ హీరోలతో కమర్శియల్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించిన ఈ జాణ తదుపరి విజయ్‌తో జత కట్టనుంది. మరో పక్క అరమ్–2 వంటి కథానాయకి సెంట్రిక్ పాత్ర చిత్రాలను చేయడానికి సిద్ధం అవుతోందనుకోండి. ఈ బ్యూటీ సినిమా విషయాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా చూస్తే ఇటీవల ఈ అమ్మడు జాగ్వర్ అనే ఖరీదైన కారును కొనుగోలు చేసింది.
అయితే ఆమె ప్రస్తుత స్థాయికి అలాంటి కారు కొనడం పెద్ద విషయమేమీ కాదు. ఒక చిత్రానికి రూ.5 కోట్ల వరకూ పారితోషికం పుచ్చుకుంటోంది. కాగా నయనతార బయట ప్రాంతాల్లో షూటింగ్ అయితే బీఎండబ్ల్యూ కారును వాడుతుందట. అందుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. కొత్తగా కొన్న జాగ్వర్ కారును చెన్నైలో షూటింగ్‌లకు ఉపయోగిస్తుందట. దీనికి మాత్రం డ్రైవర్ తన లవర్ విఘ్నేశ్‌శివన్‌నే నట. ఆయన నయనతారపై ఉన్న ప్రేమతో ఆమె డ్రైవర్ బాధ్యతలను తనే తీసుకున్నాడట. నయనతార కారుకు డ్రైవర్‌గా మారడమే కాకుండా, ఆమె నటించే చిత్రాల కథలను తనే వింటున్నారు. తన ప్రియురాలు సంతోషంగా ఉండాలని ఆమెకు నచ్చిన విషయాలను చేస్తున్నారట. అందుకే విఘ్నేశ్ శివన్ సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు నయనతార చాలా ఆనందంగా కనిపిస్తుంది. నయనతారను సంతోషంగా ఉంచడం బాగానే ఉందిగానీ,ఆమెను త్వరలో పెళ్లి చేసుకోవలసిందిగా విఘ్నేశ్ శివన్‌ను అభిమానులు ఒత్తిడి చేస్తున్నారట. వారి కోరికలోనూ న్యాయం ఉంది కదా!
Comments
Please login to add a commentAdd a comment