
సాక్షి, చెన్నై: లవ్‌బర్డ్స్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గుజరాతీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరూ నిర్మాతలుగా మారి రౌడీ పిక్చర్స్ పతాకంపై తమిళంలో ఇప్పటికే పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గుజరాతీ భాషలో చిత్రం నిర్మించడానికి సిద్ధమయ్యారు. తమిళంలో విజయం సాధించిన ఆండవన్ కట్టలై చిత్రాన్ని గుజరాతీ భాషలో రీమేక్ చేస్తున్నారు. దీనికి శుభయాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇందులో గుజరాతీ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మల్హర్ టక్కర్, నటి మొనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. దీనికి ప్రముఖ గుజరాతీ దర్శకుడు మనీష్ సైనీ దర్శకత్వం నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటనను నయనతార, విఘ్నేష్ శివన్ విడుదల చేశారు. ఇకపై గుజరాతీ భాషలోనూ వరుసగా చిత్రాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన కాత్తువాక్కుల రెండు కాదల్ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment