
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ, ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విజయ్, ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మరోసారి కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తమిళంలోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment