
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంజలి సీబీఐ’ పేరుతో అనువదిస్తున్నారు. ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. నయనతార సిబిఐ ఆఫీసర్ గా టైటిల్ రోల్ లో నటించింది. ఈ చిత్రంలో అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు.
ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విక్రమాదిత్య అనే అతిథి పాత్రలో నటించారు. నయనతార భర్త పాత్ర ఇది. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ బ్యానర్ సంస్థలో సీజే జయకుమార్ నిర్మించారు. హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు అనువాద కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగు హక్కులను దక్కించుకున్నారు నిర్మాతలు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్. ఫిబ్రవరి 22న అంజలి సీబీఐ ఆఫీసర్ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment