నయన పెళ్లెప్పుడు? | Nayanthara And Vignesh Shivan Postponed Marriage | Sakshi
Sakshi News home page

నయన పెళ్లెప్పుడు?

Published Sat, Sep 14 2019 8:28 AM | Last Updated on Sat, Sep 14 2019 8:28 AM

Nayanthara And Vignesh Shivan Postponed Marriage - Sakshi

నయనతో విఘ్నేశ్‌శివన్‌

సినిమా: నటి నయనతార పెళ్లి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంచలన మలయాళ బ్యూటీకి నటిగా ప్రమోషన్‌ అవుతోంది కానీ, పెళ్లి విషయంలో ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఇప్పటికే పెళ్లి విషయంలో రెండు సార్లు భంగపడింది. మొదట్లో నటుడు శింబుతో డీప్‌ లవ్‌లో పడినా అది అక్కడితోనే బెడిసి కొట్టింది. మ్యారేజ్‌ వరకూ దారి తీయలేదు. రెండోసారి ప్రభుదేవాతో ప్రేమ దాదాపు పెళ్లి వరకూ వచ్చింది కానీ అదీ కథ కంచికే అన్నట్లుగా అయ్యింది. పాపం ఆయనతో పెళ్లి కోసం నయనతార మతం కూడా మార్చుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత ప్రేమ వ్యవహారానికి కొంత దూరంగా ఉండి కెరీర్‌పై దృష్టి సారించిన నయనతార అగ్ర కథానాయకి స్థాయికి చేరుకుంది. దీంతో ఆమెలో అణగారిన ప్రేమ మరోసారి బుసలు కొట్టింది. అంతే దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌లో పరిచయం ప్రేమగా మారింది. ఈ సారి నయనతార కాస్త జాగ్రత్త పడింది. ముందు చేసిన తప్పులు మళ్లీ చేయకుండా విఘ్నేశ్‌శివన్‌తో తన ప్రేమను సహజీవనంగా మార్చుకుంది. అవును వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే ఇంటిలో నివశిస్తూ ఒకరికొకరుగా కలిసి జీవిస్తున్నారు. ఈ జీవితాన్ని వారు మూడు బర్త్‌డేలు, ఆరు విహారయాత్రలుగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

అయితే ఇక్కడ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ కుటుంబసభ్యులు పెళ్లి చేసుకోమని ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని విఘ్నేశ్‌శివన్‌ పలుమార్లు నయనతారతో చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పినట్లు సమాచారం. దీంతో నయనతార కూడా పెళ్లికి సిద్ధమైనట్లు ఈ ఏడాదిలోనే ఈ సంచలన జంట వివాహం జరగనున్నట్లు ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. నయనతారకు కథానాయకిగా క్రేజ్‌ పెరుగుతోందే కానీ, తరగడం లేదు. ఆ మధ్య వర్ధమాన నటులతో, హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రల్లోనూ నటిస్తూ వచ్చిన నయనతార ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్, దళపతి విజయ్, తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి వంటి వారితో నటించే అవకాశం రావడంతో ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని సమాచారం. స్టార్‌ హీరోలతో నటిస్తున్న నయనతార దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా వాసి కెక్కింది. దీంతో దక్షిణాదిలో స్టార్‌ హీరోలతో మరో రౌండ్‌ కొట్టాలనుకుంటోందని సమాచారం. అందుకు పెళ్లి ప్రతిబంధకం అవుతుందనే భావనతో విఘ్నేశ్‌శివన్‌తో వివాహాన్ని వాయిదా వేయమని చెప్పినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం విఘ్నేశ్‌శివన్‌ కూడా దర్శకుడిగానూ, నిర్మాతగానూ బిజీగా ఉండడంతో పెళ్లికి తొందర పడే అవకాశవం లేదనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడాయన నటుడు శివకార్తికేయన్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అదేవిధంగా నయనతార ప్రధాన పాత్రలో నటించే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మొత్తం మీద నయనతార పెళ్లి మరోసారి అలా వాయిదా పడబోతోందన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement