
Nayanthara Starts New Business With Renitha Rajan: ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లంతా మరోవైపు వ్యాపార రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న స్టార్ హీరోయిన్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అలియా భట్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నయన తారలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ది లిప్‌బామ్ కంపెనీ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది.
చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్
చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి నయన్ ఈ బ్రాండ్‌ను తాజాగా ప్రారంభించింది. ఈ సందర్భంగా రేణిత రాజన్ మాట్లాడుతూ.. ‘మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్ చెప్పుకొచ్చారు.
చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్
కాగా గతంలో కత్రినా కైఫ్ కూడా ఇలాగే బ్యూటీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకోనున్న నయనతార కేరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భర్త డైరెక్షన్‌లో ఇటీవల నయన్ నటించిన ‘కాత్తువక్కుల రెండు కాదల్’ త్వరలోనే విడుదల కానుంది. అలాగే చిరంజీవి సరసన ‘గాడ్ ఫాదర్’లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ నయన్ సంతకం చేసింది.