
నయనతార
ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్‌లను మ్యానేజ్ చేస్తూ కెరీర్‌లో మరో లెవల్‌కు వెళ్తున్న హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రుతీహాసన్, రాశీ ఖన్నాల జాబితాలో హీరోయిన్ నయనతార కూడా చేరారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మించనున్న ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేసేందుకు నయనతార పచ్చ జెండా ఊపారని తెలిసింది. ఆమెకు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్. సో.. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో నయనతార తొలి అడుగు వేస్తున్నారన్న మాట.
రెండు సీజన్స్‌గా రాబోతున్న ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబరులో ఆరంభం కానుంది. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఈ పాత్ర పూర్వాపరాల మీద వెబ్ సిరీస్ ఉంటుందని టాక్. 2015లో వచ్చిన ‘భలే మంచి రోజు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పంజాబీ నటి వామికా గబ్చి ఈ శివగామి పాత్ర చేయనున్నారని సమాచారం. అదే నిజమైతే నయనతార పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక నయనతార నటించిన తాజా చిత్రాలు ‘అన్నాత్తే’, ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’, ‘నెట్రిక్కన్’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment