అందం కోసం మాతృగడ్డలో చికిత్స .. | Nayantara Kerala Treatment For Beauty | Sakshi
Sakshi News home page

అందం కోసం ఎందాకైనా..

Published Mon, Oct 14 2019 7:58 AM | Last Updated on Mon, Oct 14 2019 11:57 AM

Nayantara Kerala Treatment For Beauty - Sakshi

సినిమా: అందమె ఆనందం. ఆనందమే జీవిత మకరందం అన్నారో మహాకవి. అందానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సినీ కథానాయికలకైతే ఆదే ప్రథమాయుధం. ఆ తరువాతే అభినయం గట్రా. అందులోనూ అగ్ర కథానాయకిగా వెలిగిపోతున్న నయనతార వంటి వారికి అందం విలువ చాలా తెలుసు. అంతే కాస్త వయసు పైబడుతున్న విషయం అవగతం అవడంతో  తన బాహ్య అందం గురించి ఈ బ్యూటీ ఇటీవల చాలా కలత చెందిందట. కారణం తన శరీర సౌష్టవం కంటే ముఖం ముదిరినట్లు కనిపించడమే. ఎంతగా జిమ్‌లో కసరత్తులు, యోగాలు వంటివి చేసినా వయసు భారం అనేది ఒకటుంటుంది కదా.. నయనతారకు ఇప్పుడు 34 ఏళ్లు. అది తన ముఖంలో తెలుస్తుండడమే ఈ అమ్మడి చింతకు కారణం. అంతే అందాన్ని పరిరక్షించుకోవడానికి పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలెట్టగా, తన మాతృగడ్డ అయిన కేరళలోనే అందుకు తగిన చికిత్స ఉందని తెలుసుకుందట. అంతే షూటింగ్‌లకు కాస్త గ్యాప్‌ చూసుకుని ఇటీవల అందాన్ని మెరుగు పరిచే చికిత్సను తీసుకుందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నయనతార 1984లో పుట్టింది. 34 ఏళ్ల ఈ సంచలన నటి  దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే విఘ్నేశ్‌శివన్‌ 1985లో పుట్టాడు. ఆయన వయసు 33 ఏళ్లు. అంటే నయనతార కంటే ఏడాది చిన్నవాడన్నమాట. అయితే తన కంటే కాస్త వయసులో చిన్నవారిని అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అరుదైన విషయమేమీ కాదు. కానీ విఘ్నేశ్‌శివన్, నయనతార కలిసి సహజీవనం చేస్తున్నా, ఆ విషయాన్ని గానీ, వారి ప్రేమ బంధాన్ని కాన్నీ బహిరంగంగా ఎక్కడా వెల్లడించలేదు. అయితే వారి పెళ్లిపై జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం విఘ్నేశ్‌శివన్‌ ఖండించారు. ఇక ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు స్పెషల్‌ ఫొటో సెషన్‌తో పాటు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన నయనతార తానేమనుకుంటున్నానో ఆ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. అందుకే నటించడం మినహా బయట ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టుగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. బహుశా గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలే ఇందుకు కారణం కావచ్చు. ఒక్క విషయాన్ని మాత్రం నయనతార స్పష్టంగా చెప్పింది. తాను ప్రతి నిమిషం భయంతోనే జీవిస్తున్నానని, అందుకు కారణం మంచి చిత్రాన్ని తన అభిమానులకు ఇవ్వలేనానని చెప్పింది. ఇకపోతే తాను మాట్లాడడం కంటే తన చిత్రాలే మాట్లాడాలని భావించే నటిని తానని ఈ సంచలన నటి పేర్కొంది. నయనతార నటుడు విజయ్‌తో నటించిన బిగిల్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. ఆ తరువాత రజనీకాంత్‌తో జతకట్టిన దర్బార్‌ సంక్రాంతి సంబరాలకు సన్నద్ధం అవుతోంది. ఇకపోతే ఈ అమ్మడు నవఅందాలతో దిగిన ఫొటోలను నెటిజన్లు ప్రసారం చేస్తూ పండగ చేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement