
వీలున్నప్పుడల్లా వెకేషన్‌కు వెళ్లడం లవ్‌బర్డ్స్ విఘ్నేష్ శివన్, నయనతారకు అలవాటు. కోవిడ్ వల్ల కొన్ని నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సింది వచ్చింది. మొన్నే ఓనమ్ పండగకు నయనతార సొంతూరు కొచ్చిన్‌కి వెళ్లారు. నయనతో పాటు విఘ్నేష్ కూడా కొచ్చిలో పండగ జరుపుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ గోవా ట్రిప్ ప్లాన్ చేశారు.
గోవాలో హాలిడే చేసుకుంటున్న ఫోటోలను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ హాలిడేలో విఘ్నేష్ తల్లి కూడా జాయిన్ అయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార నటిస్తున్న ‘నెట్రికన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు విఘ్నేష్. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కాదువాక్కుల రెండు కాదల్’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు నయనతార. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.