
తిరుమలలో మహేశ్ ఫ్యామిలీ
వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఇష్టమైన కానుక తల నీలాలే. అందుకే ‘తల నీలాలు సమర్పిస్తాం’ అని మొక్కుకుని మరీ తిరుమల వెళ్లి, మొక్కు తీర్చుకుంటారు. మొక్కుని మాత్రం బయటికి చెప్పరు. మరి.. నమ్రతా మహేశ్ ఏం మొక్కుకున్నారో కానీ.. తిరుమలేశుడికి తల నీలాలు సమర్పించారు. కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఆమె తిరుమల వెళ్లారు. మహేశ్ కుటుంబం దేవుణ్ణి బాగా నమ్ముతుందని అర్థమవుతోంది.
మొన్నటికి మొన్న వినాయక చవితిని ఘనంగా జరిపారు. గౌతమ్ స్వయంగా వెళ్లి, చెరువులో వినాయకుణ్ణి నిమజ్జనం చేశాడు. ఆ సంగతలా ఉంచితే, మహేశ్ ఫ్యామిలీతో కలసి దర్శకుడు మెహర్ రమేశ్ కూడా తిరుమల వెళ్లారని ఇక్కడున్న ఫొటో స్పష్టం చేసింది. ఈ మధ్య మహేశ్ నటించిన ఓ యాడ్‌కు దర్శకత్వం వహించిన మెహర్ రమేశే భవిషత్తులో ఆయనతో సినిమా కూడా చేస్తారేమో?