Mahesh Babu Emotional Birthday Wishes To His Son Gautam, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu: గుర్తుపెట్టుకో.. నీకు ఎ‍ప్పుడు అవసరమైనా నీ వెన్నంటే ఉంటా!

Aug 31 2022 11:23 AM | Updated on Aug 31 2022 4:11 PM

Mahesh Babu pens Heartfelt Birthday Wish for his son Gautam - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన కుమారుడు గౌతమ్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'నా యంగ్‌ మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో అత్యుత్తమంగా ఎదిగే సమయం కోసం నేను వేచి చూస్తున్నాను. కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. గుర్తుపెట్టుకో.. నీకు ఎ‍ప్పుడు అవసరమయినా నీ వెన్నంటే ఉంటా! లవ్‌ యూ మై సన్‌.. నువ్వు ఊహించినంత కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు. 

ఇదిలా ఉంటే, మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

చదవండి: (Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement