గౌతమ్‌ బర్త్‌డే: మహేశ్‌, నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌ | Mahesh Babu And Namrata Heartfelt Wishes To His Son Gautam 15 th Birthday | Sakshi
Sakshi News home page

Gautam Ghattamaneni: లవ్‌ యూ గౌతమ్‌.. వెళ్లి ప్రపంచాన్ని జయించు: మహేశ్‌

Published Tue, Aug 31 2021 11:50 AM | Last Updated on Mon, Sep 20 2021 11:33 AM

Mahesh Babu And Namrata Heartfelt Wishes To His Son Gautam 15 th Birthday - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని 15వ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్‌ 31). ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ లిటిల్‌ ప్రిన్స్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు మహేశ్‌ బాబు, నమ్రత. 



హ్యాపీ 15 మై సన్.. నీ ఎదుగుదలను చూస్తుండడం నాకెప్పుడూ గొప్ప ఆనందం.. ఎల్లప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్లి ప్రపంచాన్ని జయించు.. లవ్ యూ’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా తమ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గౌతమ్‌ ఫోటోని షేర్‌ చేసింది. 

ఇ​క​ గౌతమ్‌ విషయానికి వస్తే.. మహేశ్‌ హీరోగా నటించిన వన్‌- నేనొక్కడినే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  అప్పుడు గౌతమ్‌కు కేవలం 8 సంవత్సరాల వయస్సు మాత్రమే. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్.. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్లలో స్థానం దక్కించుకున్నాడు. ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు. ప్రస్తుతం స్టడీస్‌తో పాటు తనకిష్టమైన స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్న గౌతమ్ త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement