జూన్‌లో సాట్టైకు సీక్వెల్ ప్రారంభం | Kishore Thambi Ramiah Sattai 2 shoot to begin in June 2016 | Sakshi
Sakshi News home page

జూన్‌లో సాట్టైకు సీక్వెల్ ప్రారంభం

Published Thu, May 19 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

జూన్‌లో సాట్టైకు సీక్వెల్ ప్రారంభం

జూన్‌లో సాట్టైకు సీక్వెల్ ప్రారంభం

 ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ న డుస్తోందని చెప్పవచ్చు. సక్సెస్ అయిన పెద్ద చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకూ సీక్వెల్‌కు సిద్ధం అవుతున్నాయి.అలాంటి చిత్రాల కోవలో సాట్టై చేరనుంది. విద్య ప్రధానాంశంగా రూపొందిన సాట్టై చిత్రం మంచి ప్రజాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మైనా, సాట్టై, మొసకుట్టి, షావుకార్‌పేట్టై చిత్రాలను నిర్మించిన షాలోమన్ స్టూడియోస్ అధినేతలు జాన్‌మ్యాక్స్, జోన్స్ ప్రస్తుతం భరత్ హీరోగా బొట్టు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వడివుడైయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమ్రేష్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
  ఈ చిత్రం నిర్మాణ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్ర నిర్మాతలు తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సాట్టైకు సీక్వెల్‌ను ప్రారంభించనున్నారు. దీనికి గౌతమ్ అనే నవ దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నారు. ఈయన ఇంతకు ముందు పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. ఇందులో ఆడుగళం, సోల్లాదవన్ వంటి పలు చిత్రాల్లో నటించిన కిశోర్, తంబిరామయ్య ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సాట్టై-2 చిత్ర షూటింగ్‌ను జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement