చైతన్య, గౌతమ్‌లకు బసంతితో మంచి బ్రేక్ రావాలి - పవన్‌కల్యాణ్
చైతన్య, గౌతమ్‌లకు బసంతితో మంచి బ్రేక్ రావాలి - పవన్‌కల్యాణ్
Published Mon, Feb 10 2014 12:08 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
‘‘మొన్ననే ‘బాణం’ డీవీడీ చూశా. తెగ నచ్చేసింది. చైతన్య బాగా తీశాడు. తన రెండో సినిమా ‘బసంతి’ కూడా మంచి విజయం సాధించి, దర్శకుడు చైతన్యకు, హీరో గౌతమ్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బాణం’ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘బసంతి’. అలీషాబేగ్ కథానాయిక. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి టి.సుబ్బిరామిరెడ్డి, గౌతమ్‌లకు అందించారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ-‘‘ఈ కథ చాలా రోజుల క్రితం విన్నాను. చాలా నచ్చింది. రిలీజ్‌కి ముందే పాటలు కూడా విన్నాను. అన్నీ హృదయాన్ని తాకాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలి. దర్శకునిగా చైతన్యకు ఈ సినిమా బ్రేక్ అవ్వాలి’’ అని అభిలషించారు. ‘‘మణిశర్మగారి పాటలు వింటూ పెరిగాను. హీరో అయ్యాక... ఆయనతో పనిచేసే ఛాన్స్ కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఈ సినిమాకు మణిగారిచ్చిన అయిదు పాటలూ నాకు ఫేవరెట్సే. సిన్సియారిటీ, డెడికేషన్, హార్డ్ వర్క్, సినిమా పట్ల పేషన్... ఇవన్నీ ఉన్న దర్శకుడు చైతన్య. ఈ సినిమా ద్వారా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.
నేనిక్కడ నిలబడటానికి కారణం మా నాన్న. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఈ రోజుని జీవితాంతం గుర్తుంచుకుంటాను. కారణం పవన్‌కల్యాణ్‌గారు ఈ వేడుకకు రావడమే. మా లాంటి యువహీరోలందరికీ స్ఫూర్తి ఆయన’’ అని గౌతమ్ చెప్పారు. ఇంకా బ్రహ్మానందం, జానిలీవర్, శేఖర్ కమ్ముల, మంచు విష్ణు, దేవకట్టా, భీమినేని, సునిల్, కేఎల్ దామోదరప్రసాద్, వివేక్ కూచిభోట్ల, వీరుపోట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విజయం సాధించాలని వీడియో ద్వారా చిరంజీవి ఆకాంక్షించారు.
Advertisement
Advertisement