బసంతి కళాశాలలో ఏం జరిగింది?
బసంతి కళాశాలలో ఏం జరిగింది?
Published Sun, Jan 19 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
‘షోలే’ సినిమాలో హీరోయిన్ హేమమాలిని పాత్ర పేరు ‘బసంతి’. ఆ సినిమా గుర్తున్నంత కాలం... ఈ బసంతి కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడీ ‘బసంతి’ టైటిల్‌తో దర్శకుడు చైతన్య దంతులూరి ఓ సినిమా చేస్తున్నారు. అయితే బసంతి అనేది ఇందులో హీరోయిన్ పేరు కాదట. ఓ కళాశాల పేరట. ఈ కాలేజీ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను మిళితం చేసి ఈ కథను అల్లుకున్నారట. ఆ కళాశాలలో ఏం జరిగిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమట.
పసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో విద్యార్థిగా హీరోచిత పాత్ర చేస్తున్నారు. అలీషా బేగ్ నాయిక. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఈ నెల 25న పాటలను విడుదల చేయబోతున్నారు. సహనిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. కృష్ణ చైతన్య, శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.
Advertisement
Advertisement