Its Official: Kajal Aggarwal Expecting First Child With Husband Gautam Kitchlu, Check Out Post - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాం.. కాజల్‌ దంపతులు

Jan 2 2022 10:39 AM | Updated on Jan 2 2022 2:10 PM

Its Official: Kajal Aggarwal Expecting First Child With Husband Gautam Kitchlu - Sakshi

కాజల్‌ గర్భం దాల్చిందని, దీంతో ఆమె కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించనుందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇదే నిజమని ఒక్క పోస్ట్‌తో క్లారిటీ..

Kajal Aggarwal Is Pregnant: అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతుందంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. కాజల్‌ గర్భం దాల్చిందని, దీంతో ఆమె కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించనుందంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లూ. భార్య కాజల్‌ ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌లో పొందుపరిచాడు.

ఇది చూసిన ఫ్యాన్స్‌ 'ఓ మై గాడ్‌.. కాజల్‌ త్వరలో తల్లి కాబోతుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు', 'త్వరలోనే జూనియర్‌ కాజల్‌ వచ్చేస్తుందన్నమాట' అంటూ ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కాజల్‌ తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను గతేడాది అక్టోబర్‌ 30న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమా షూటింగ్స్‌తో మరింత బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కాజల్‌ ప్రస్తుతం ఉమ అనే సినిమా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement