‘రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి’ | muneeswar ganganna demands Baba Ramdev arrest | Sakshi
Sakshi News home page

‘రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి’

Published Sun, May 4 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

muneeswar ganganna demands Baba Ramdev arrest

ఎదులాపురం, న్యూస్‌లైన్ : దళితుల్ని అవమానపర్చిన రాందేవ్ బాబాను వెంటనే  అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి మునీశ్వర్ గంగన్న, ఉపాధ్యక్షుడు గౌతం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన ఓ దొంగ బాబా అని పేర్కొన్నారు.

బాబాను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు, ఆయన వ్యాపారాలు మూసి వేసే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement