‘రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి’
ఎదులాపురం, న్యూస్‌లైన్ : దళితుల్ని అవమానపర్చిన రాందేవ్ బాబాను వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి మునీశ్వర్ గంగన్న, ఉపాధ్యక్షుడు గౌతం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన ఓ దొంగ బాబా అని పేర్కొన్నారు.
బాబాను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు, ఆయన వ్యాపారాలు మూసి వేసే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.