
ఇప్పటివరకూ నెగిటివ్... ఇప్పుడు పాజిటివ్
ప్రస్తుతం సమాజంతో పాటు మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు మన దేశంలో కనుమరుగవుతాయనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మరో దృశ్యం’. గౌతమ్, అవంతిక, సింధూర ముఖ్య తారలు. కట్ల రాజేంద్రప్రసాద్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌ఎమ్ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఉత్కంఠగా సాగుతూనే వినోదం పంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘రెడీ రా రెడీ.. రగులుతున్న వయసే ఇదిరా’ పాట చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ నెగిటివ్ రోల్స్‌లో కనిపించిన నేను ఫస్ట్ టైమ్ ఓ బాధ్యతగల సీఐగా పాజిటివ్ పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రంలో నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు. తప్పకుండా నాకు మంచి బ్రేక్ అవుతుంది’’ అని నటుడు షఫీ అన్నారు.