విజయకృష్ణ మందిర్.. ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తి వనం ఏర్పాటు
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేశ్ విజయకృష్ణ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో విజయకృష్ణ మందిర్–ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తి వనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘ఈ పార్క్ గతం, భవిష్యత్ తరానికి మధ్య అద్భుతమైన వారధి’’ అన్నారు. ‘‘చిత్ర పరిశ్రమ కోసం కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా స్ఫూర్తి వనం రూపొందించాం’’ అని నరేశ్ విజయకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా నరే‹శ్ విజయకృష్ణ, పవిత్రా లోకేశ్, జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని, ఖుష్బూ తదితరులు సత్కరించారు. న్యాయమూర్తి ఎన్. మాధవరావు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్, నటులు సాయి దుర్గా తేజ్, మనోజ్ మంచు, అలీ, దర్శకులు మారుతి, అనుదీప్, సతీష్ వేగేశ్న, సంగీత దర్శకుడు కోటి, నిర్మాతలు శరత్ మరార్, రాధామోహన్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment