golden jubilee celebrations
-
యాభై వసంతాల వేడుక
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేశ్ విజయకృష్ణ. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో విజయకృష్ణ మందిర్–ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తి వనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘ఈ పార్క్ గతం, భవిష్యత్ తరానికి మధ్య అద్భుతమైన వారధి’’ అన్నారు. ‘‘చిత్ర పరిశ్రమ కోసం కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా స్ఫూర్తి వనం రూపొందించాం’’ అని నరేశ్ విజయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నరే‹శ్ విజయకృష్ణ, పవిత్రా లోకేశ్, జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని, ఖుష్బూ తదితరులు సత్కరించారు. న్యాయమూర్తి ఎన్. మాధవరావు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్, నటులు సాయి దుర్గా తేజ్, మనోజ్ మంచు, అలీ, దర్శకులు మారుతి, అనుదీప్, సతీష్ వేగేశ్న, సంగీత దర్శకుడు కోటి, నిర్మాతలు శరత్ మరార్, రాధామోహన్తో పాటు తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’
అహ్మదాబాద్: గ్రామాలకు సంబంధించిన ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. గురువారం గుజరాత్లోని అహ్మదాబాద్లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లక్ష మందికిపైగా రైతులు, పాడి పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్ని ప్రపంచంలో నంబర్ వన్ డెయిరీగా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు, భాగస్వామ్యపక్షాలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సహకార సంఘం(అమూల్) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ రంగం ఏటా 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, మన దేశంలో మాత్రం 6 శాతం వృద్ధిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎఫ్పీఓలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సన్నకారు రైతులను వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, ఎగుమతిదారులుగా మార్చాలని సంకలి్పంచామని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకొచి్చన పథకాలను ప్రస్తావించారు. రైతుల కోసం మైక్రో ఏటీఎంలు, గోబర్దన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇంధన దాతగా, ఎరువుల దాతగా రైతులు జంతు సంపదను వ్యాధుల బారి నుంచి కాపాడానికి రూ.15,000 కోట్లతో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, ఇప్పటికే 60 కోట్ల టీకా డోసుల ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రామాల్లో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ పంటలకు సంబంధించి రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని వివరించారు. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను ‘అన్నదాత’ నుంచి ఇంధన దాతగా, ఎరువుల దాతగా మార్చాలన్నదే ప్రభుత్వ అకాంక్ష అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి డిమాండ్ను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతన్నల బాగు కోసం ఇప్పటిదాకా ఎన్నో చర్యలు చేపట్టామని, చెరకు ధర పెంచడం కూడా అందులో ఒకటి అని తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది చెరకు రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ మోదీ గురువారం ‘ఎక్స్’లో పలు పోస్టు చేశారు. క్వింటాల్ చెరకు కనీస ధర(ఎఫ్ఆర్పీ)ను మరో రూ.25 చొప్పున పెంచుతూ మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ చెరకు కనీస ధర రూ.350కు చేరుకుంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఒంటెలు వంటి జంతువుల సంతతి వృద్ధికి సంబంధించిన పరిశ్రమలు, వ్యక్తులకు 50 శాతం పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నన్ను అవమానించడమే వారి ఎజెండా నవ్సారీ: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్ పారీ్టపై విమర్శల బాణాలు వదిలారు. దక్షిణ గుజరాత్లోని నవ్సారీ పట్టణంలో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ కులాన్ని ఎంత మంది కాంగ్రెస్ నేతలు దూషించారో మీరందరూ చూసే ఉంటారు. కానీ కాంగ్రెస్ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లెంతగా నన్ను తిడతారో 400 లోక్సభ సీట్లు గెలవాలన్న మా సంకల్పం అంతగా బలపడుతుంది. దేశం కోసం కాంగ్రెస్కు ఎలాంటి ఎజెండా లేదు. నన్ను తిట్టడమే వారి ఎజెండా. దేశ భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింతా లేదు. ఎంతగా మాపై బురద జల్లుతారో అంతగా ఆ బురదలో 370(సీట్లు) కమల పుష్పాలు విరబూస్తాయి’ అంటూ లోక్సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘వారసత్వ రాజకీయాల మాటకొస్తే కాంగ్రెస్ను మించినది మరోటి లేదు’ అని విమర్శించారు. ‘బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దేశ ఘన వారసత్వ పరిరక్షణ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. 2 అణు విద్యుత్ రియాక్టర్లు జాతికి అంకితం సూరత్: నవ్సారిలో సభ అనంతరం ఆయన పొరుగునే సూరత్ జిల్లాలో ఉన్న కక్రాపర్కు చేరుకున్నారు. కక్రాపర్ అణు విద్యుత్ స్టేషన్ వద్ద ప్రధాని మోదీ రెండు అణు విద్యుత్ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాపర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్ హెవీ వాటర్ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ప్రధాని ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ తయారైన విద్యుత్ గుజరాత్తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు సరఫరా అవుతుంది. -
సెయింట్ పాల్స్ స్కూల్లో ‘గోల్డెన్ జూబ్లీ’
హిమాయత్నగర్(హైదరాబాద్): హైదర్గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్లో పదోతరగతి(1973 బ్యాచ్) చదివి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఆదివారం ఆ బ్యాచ్కు చెందిన విద్యార్థులతా పాఠశాల ప్రాంగణంలో ఒకచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్ కోఆర్డినేటర్ వీరస్వామి మాట్లాడుతూ తమ బ్యాచ్లో 140 మంది విద్యార్థులుండగా, 75మంది వస్తారని అనుకున్నామని, 62 మంది గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. అమెరికా, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఒకరు కోల్కతా నుంచి రావడం ఆనందంగా ఉందన్నారు. కమిటీ ప్రతినిధులు కెబీఎంఎం.క్రిష్ణ, వి.కిషోర్, కోకా వెంకటరమణ, వి.రమేష్ పాల్గొన్నారు. గురువులకు సన్మానం విద్యాబుద్ధులు నేర్చిన తొమ్మిది మంది గురువులు, ప్రస్తుత ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మజర్అలీ అహ్మద్ను 1973 బ్యాచ్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి రూ. 40 లక్షలు విరాళం 1973 బ్యాచ్కు చెందిన ప్రొఫెసర్ సుధాకర్, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చల్లా కిషోర్, అతని నలుగురు సోదరులతో కలిసి పాఠశాల కొత్త భవనం కోసం రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు. -
గోదావరి ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. నేటితో ఆ రైలు పరుగులు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. విశాఖ స్టేషన్లోని ప్లాట్ఫార్మ్పై రైల్వే అధికారులు, ప్రజలు కేక్ కట్ చేశారు. గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. నేటి రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ సంబరాలు జరపనున్నారు. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ప్రెస్ 1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు-హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్ప్రెస్ ఈ రైలు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ల మధ్యలో నడుస్తుంది. ఇదీ చదవండి: ‘కానుక’ తలుపు తడుతోంది! -
ఈశాన్యం అభివృద్ధికి ఆకాశమే హద్దు
షిల్లాంగ్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ ఎనిమిదేళ్లలో తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని నార్త్ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘ఎనిమిదేళ్లలో ఈశాన్యం నుంచి విమాన సేవలు మెరుగవడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగింది. విమానాశ్రయాలు 9 నుంచి 16కు, విమానాల సంఖ్య 900 నుంచి 1,900కు పెరిగాయి. రైల్వేమ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలు కూడా చేరాయన్నారు. జాతీయ రహదారులు 50 శాతం పెరిగిందన్నారు. జలమార్గాలను విస్తరించే పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈశాన్యమే కేంద్రస్థానం ఆగ్నేయాసియాకు ఈశాన్య రాష్ట్రాలే మన ముఖద్వారమని మోదీ పేర్కొన్నారు. మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి ఈశాన్యం కేంద్రస్థానంగా మారగలదని చెప్పారు. ఆ దిశగా ఇండియన్–మయన్మార్, థాయ్లాండ్ ప్రధాన రహదారి, అగర్తలా–అఖురా రైల్వే ప్రాజెక్టు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈశాన్యంలో ఎన్నో శాంతి ఒప్పందాలు, అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు. ఫలితంగా తీవ్రవాద సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం 1971లో పార్లమెంట్ చట్టం ద్వారా నార్త్ఈస్ట్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. 1972 నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. త్రిపుర బహుముఖ అభివృద్ధే లక్ష్యం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 2 లక్షకుపైగా నూతన గృహాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. త్రిపుర బహుముఖ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రోజు 2 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని, మెజారిటీ లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. గత ఐదేళ్లుగా పరిశుభ్రత అనేది ఒక ప్రజాఉద్యమంగా మారిందని, త్రిపుర అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరించిందని ప్రశంసించారు. త్రిపురలో అనుసంధానం, మౌలిక ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘త్రిపుర గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండేది. 2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి, అనుసంధానానికి, శుభ్రతకు పర్యాయపదంగా మారింది’’ అన్నారు. ఈశాన్య భారత్ను, బంగ్లాదేశ్ను అనుసంధానించే 15 కిలోమీటర్ల అగర్తలా–అఖౌరా రైల్వేప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుందన్నారు. ఆ రాష్ట్రాలు.. అష్టలక్ష్ములు ఈశాన్య ప్రాంతాల ప్రగతికి ప్రతిబంధకంగా మారిన అవినీతి, వివక్ష, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలకు రెడ్కార్డ్ చూపించామని మోదీ అన్నారు. ‘‘నార్త్ఈస్ట్ను విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మేమొచ్చాక అలాంటి ఆటలు సాగనివ్వడం లేదు’’ అన్నారు. ఆదివారం ఉదయం షిల్లాంగ్లో ఆయన కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. గత 50 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్ఈసీ పోషించిన పాత్రను వివరిస్తూ రచించిన ‘గోల్డెన్ ఫూట్ప్రింట్స్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈశాన్యం అభివృద్ధి విషయంలో ఎన్ఈసీ అందించిన సేవలను మరువలేమని ప్రధాని మోదీ ప్రశంసించారు. నార్త్ఈస్ట్లోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మిలుగా అభివర్ణించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనిమిది పునాది స్తంభాలపై ప్రభుత్వం పనిచేయాలని ఉద్బోధించారు. అవి.. శాంతి, అధికారం, పర్యాటకం, 5జీ అనుసంధానం, సంస్కృతి, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు పనిచేయగల శక్తి అని వివరించారు. -
ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
కేపీహెచ్బీ కాలనీ: విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. జేఎన్టీ యూహెచ్ గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవం పురస్కరించుకొని ‘‘ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’’అనే అంశంపై గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మేధస్సు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణల వైపు మొగ్గుచూపాలని సూచించారు. సరికొత్త ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా టీహబ్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రోజుకు 24 గంటలపాటు విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సదుపాయం, సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై అన్ని పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత పారిశ్రామిక అభివృద్ధికి ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే మూడు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని విధానాలు రూపొందించాలని తాను సూచించినట్లు తెలిపారు. మౌలిక వసతుల సద్వినియోగం ఏదీ.. దేశంలో ఉన్న మౌలిక వసతులన్నింటినీ సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొందని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. దేశంలోనే వివిధ రూపాల్లో నాలుగు లక్షల ఆరువేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా గరిష్టంగా వినియోగించే విద్యుత్ రెండు లక్షల పన్నెండు వేల మెగావాట్లు మాత్రమేనని తెలిపారు. అయినప్పటికి విద్యుత్ ఉత్పత్తిలో దేశం వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, పారిశ్రామికవేత్త పద్మశ్రీ బి.వి.మోహన్రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ది గాడ్ ఫాదర్@ 50 ఏళ్లు
అతను.. మంచోళ్లకు మంచోడు... చెడోళ్లకు చెడ్డోడు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘గాడ్ ఫాదర్’. అన్యాయం చేసేవాళ్లకు ‘టెర్రర్’. 50 ఏళ్ల క్రితం సిల్వర్ స్క్రీ పైకి వచ్చిన ‘ది గాడ్ ఫాదర్’ ఎన్నో ప్రపంచ సినిమాల స్క్రీప్లేకి ఆదర్శమైంది. 1972 మార్చిలో విడుదలైన ‘ది గాడ్ ఫాదర్’ గోల్డె జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమా ‘శివ’కు ముందు ఆ తర్వాత అనేలా ట్రెండ్ని మార్చిన సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘ది గాడ్ ఫాదర్’ గురించి చెప్పిన విశేషాలు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ‘గాడ్ఫాదర్’ నవల ఇచ్చి, అందులో 26వ పేజీ చదవమన్నాడు. ఆ పేజీ చదివాక పుస్తకం బ్యాక్ కవర్పై ‘మాఫియాను గురించిన పుస్తకం ఇది’ అని రాసి ఉండటం చూశాను. అప్పటివరకూ మాఫియా అనేదాని గురించి నేను విన్నది లేదు. ఆసక్తితో పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేశాను. ఆ బుక్లోని క్యారెక్టరైజేషన్స్, అందులోని డ్రామా, ఆ బుక్ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించాయి. వెంటవెంటనే మూడునాలుగుసార్లు చదివాను. చదవడం పూర్తి చేసిన ప్రతిసారీ ఏవో కొత్త విషయాలు తెలిశాయన్న ఫీల్ కలిగేది. స్టోరీ టెల్లింగ్పై నాకు ఆసక్తి కలగడానికి ‘గాడ్ ఫాదర్’ పుస్తకం, ఆ తర్వాత ఆ పుస్తకం ఆధారంగా వచ్చిన సినిమాయే నాలో స్ఫూర్తిని నింపినట్లుగా నాకనిపిస్తుంటుంది. నేను దర్శకుడిగా మారాక ఓ సీ కోసమో, డైలాగ్ కోసమో... ఇలా పలు విషయాలకు ‘గాడ్ ఫాదర్’ పుస్తకాన్ని రిఫరెన్స్లా వినియోగించుకున్నాను. ► ‘సర్కార్’ కోసం అమితాబ్ బచ్చని కలిసినప్పుడు ‘ది గాడ్ ఫాదర్’ సినిమా అడాప్ష గురించిన ఆలోచన నాకు కలిగింది. నిజానికి ‘ది గాడ్ ఫాదర్’ సినిమా పూర్తి స్థాయి మాఫియా డా గురించి కాదేమో! వీటో కార్లియో (‘ది గాడ్ ఫాదర్’ చిత్రంలో మార్ల బ్రాండో చేసిన డా పాత్ర)లాంటి స్వభావం ఉన్నవారు మాఫియా రంగంలోనే కాదు.. పొలిటికల్, మెడికల్ వంటి రంగాల్లోనూ ఉన్నారు. ఇలాంటి వారు తమ పవర్, స్వభావాలతో ఏమైనా చేయగలరు. ఇండియా విషయానికి వస్తే.. పొలిటికల్గా నాకు బాల్ థాక్రే అలా కనిపిస్తారు. ఆయన చరిష్మా ఎలాంటిదంటే అధికారికంగా ఆయన ఏ పొజిషలో లేకపోయినా.. ఆయన కోసం చంపేవాళ్ళతో పాటు చనిపోయేవాళ్లూ ఉండేవారు. ► ‘ది గాడ్ ఫాదర్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం స్క్రిప్ట్, క్యారెక్టర్స్, డైరెక్ష... ఇలా ప్రత్యేకంగా ఏ ఒక్క అంశాన్నో చెప్పలేం. ఈ చిత్రంలో మార్ల బ్రాండో ప్రధాన పాత్రధారిగా కనిపించి ఉండొచ్చు కానీ సినిమాలోని ఏ క్యారె క్టరూ మర్చిపోలేని రీతిలో ఉంటుంది. ‘ది గాడ్ ఫాదర్’ కెమెరామ్యా గోర్డా విల్లీస్, మ్యూజిక్ డైరెక్టర్ నినారోట, రచ యిత మారియో çప్యూజో, దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా.. వారి కెరీర్లో చాలా చిత్రాలు చేసి ఉండొచ్చు కానీ ‘ది గాడ్ ఫాదర్’కు కుదిరినట్లుగా వారి పనితనం మరే సినిమాకూ కుదర్లేదేమో! ► అప్పట్లో క్రిమినల్స్ ఆహార్యం కాస్త భయం కలిగించేలా ఉండేది. కానీ ‘ది గాడ్ ఫాదర్’లో మాత్రం మనవారో, మన చుట్టుపక్కలవారో క్రిమినల్స్ అన్నట్లుగా చూపించారు. అందుకే ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యారు. మనందరి మధ్యలోనే ఉండే రాక్షసులకు ప్రతిరూపంలా నిలిచిన చిత్రంగా ‘ది గాడ్ ఫాదర్’ను చెప్పుకోవచ్చు. ► ‘ది గాడ్ ఫాదర్’ చిత్రం ఓ తరగని నిధి వంటిది. ఈ మూవీలోని పాత్రల్లో విభిన్నమైన పార్శా్వలు ఉంటాయి. మనుషుల భావోద్వేగాలు ఉన్నంతకాలం ఈ పార్శా్వల నుంచి కొత్త అంశాలను ఆవిష్కరించుకోవచ్చు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఆధారంగా కొత్త చిత్రాలు తీయొచ్చన్నది నా అభిప్రాయం. ► ‘ది గాడ్ ఫాదర్’ చిత్రాన్ని అమెరిక రచయిత మారియో ప్యూజో రాసిన ‘గాడ్ ఫాదర్ బుక్ ఆధారంగా తీశారు. అలాంటి పుస్తకాలు ఇండియాలో ఈ రోజుల్లో వస్తాయని నేను అనుకోవడం లేదు. పైగా నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్న ఈ రోజుల్లో పుస్తక పఠనానికి పూర్వవైభవం దక్కుతుందా? అనే అనుమానం ఉంది నాకు. ► ‘గాడ్ ఫాదర్’ నవలను ‘ది గాడ్ పాదర్’ చిత్రంలో పూర్తిగా వెండితెరపై ఆవిష్కరించబడలేదు. ఒక పుస్తకం సోల్ను కేవలం రెండున్నర గంటల్లో వెండితెరపై చూపించడం అనేది ఎవరికైనా క్లిష్టతరమైన పని. కానీ ‘గాడ్ఫాదర్’ నవలలోని కథను వెండితెరపైకి తీసుకురావడంలో దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా చాలావరకు విజయం సాధించారనే అనుకుంటున్నాను. ‘ది గాడ్ ఫాదర్’ కథేంటంటే... న్యూయార్క్ నగరానికి చెందిన డా విటో కోర్లియో (మార్ల బ్రాండో) తిరుగు లేని డా. ప్రజల కష్టాలు తీర్చే మంచి డా. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో అక్రమార్కులను అంతం చేసే డా. ‘మంచి డా’... ‘నేర చరిత్ర’ ఉన్న డా. విటోకి ముగ్గురు కొడుకులు, ఒక పెంపుడు కొడుకు, సలహాదారు టామ్ హేగ (రాబర్ట్ డువల్), ఒక కూతురు కాన్నీ (టాలియా షైర్) ఉంటారు. పెద్ద కొడుకు సన్నీ (జేమ్స్ కా), రెండోవాడు ఫ్రెడో (జా కజేల్), మూడోవాడు మైఖేల్ (అల్ పచీనో). సన్నీ, మైఖేల్ చురుకైనవాళ్లు. తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు సన్నీ. మైఖేల్కి ఈ వ్యాపారం నచ్చదు. పైగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ ఆడమ్స్ (డయానే కీట) కి తండ్రి నేర చరిత్ర చెప్పి, తాను అటువంటి వాడిని కాదంటాడు. పైగా తమ వ్యాపారాలను చట్టబద్ధం చేస్తానని ఆమెకు మాట కూడా ఇస్తాడు. అయితే శత్రు మాఫియా కుటుంబం అయిన టటాలియా మద్దతు మెండుగా ఉన్న సొలోజ్జో వల్ల కథ వేరే మలుపు తిరుగుతుంది. సినిమా చివర్లో మైఖేల్నే అనుచరులు కొత్త డా గా గౌరవిస్తారు. అతని చేతిని ముద్దాడతారు. కొన్ని విశేషాలు ► ‘ది గాడ్ ఫాదర్’కి డైరెక్ష చేయమని పారామౌంట్ పిక్చర్స్ పన్నెండు మంది దర్శకులను సంప్రదిస్తే ఎవరూ ముందుకు రాలేదు. కప్పోలా కూడా నవల చవకబారుగా ఉందని, సినిమా చేయలేనని ముందు నిరాకరించారు. అయితే అప్పటికే నిర్మాతగా కప్పోలా తీసిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో, ఆ అప్పులు తీర్చడం కోసం ఈ సినిమా చేశారు. ∙టైటిల్ రోల్కి మార్ల బ్రాండో స్థానంలో వేరే నటుడిని తీసుకోవాలన్నది నిర్మాతల ఆలోచన. అంతకుముందు చిత్రాల్లో బ్రాండోకి ఉన్న సమస్యల వల్ల అలా అనుకున్నారు. అయితే బ్రాండోనే కావాలని పట్టుబట్టారు దర్శకుడు. చివరికి స్క్రీ టెస్ట్కి ఆమోదించాలని, నిర్మాణానికి ఆటంకాలు కలిగించకూడదని ఒప్పందం చేసుకున్నాకే బ్రాండోని తీసుకున్నారు. ► స్క్రీ టెస్ట్ అప్పుడు బుగ్గలు నిండుగా కనిపించడానికి మార్ల్లని నోట్లో టిష్యూ పేపర్లు ఉంచుకుని, డైలాగ్ చెప్పమని, ఓ మూడు సీన్లు తీశారు కప్పోలా. అవి చూశాక నిర్మాతలు మరో మాట మాట్లాడకుండా మార్లని ఓకే చేశారు. ► ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీ ప్లే.. ఇలా మొత్తం 11 విభాగాలలో ఆస్కార్ అవార్డులకు నామినేష దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీ ప్లే విభాగాల్లో అవార్డు దక్కించుకుంది. ► ఆస్కార్ అవార్డుని మార్ల బ్రాండో తిరస్కరించి, అవార్డు వేడుకకు హాజరు కాలేదు. అయితే 4 పేజీల ఉత్తరాన్ని బాలనటì సచీ లిటిల్ ఫెదర్తో పంపారు. మార్లకి అవార్డు ప్రకటించగానే, ఆ బాలనటి వేదిక మీదకు వెళ్లి, అమెరికాలోని స్థానిక రెడ్ ఇండియన్ల పట్ల హాలీవుడ్ పరిశ్రమ వివక్ష చూపెడుతున్నందుకు నిరసనగా మార్ల అవార్డుని తిరస్కరించారని పేర్కొని, ఆ ఉత్తరాన్ని విలేకరులకు అందజేసింది. ► దాదాపు ఏడు మిలియ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం సుమారు 280 మిలియ డాలర్లు వసూలు చేయడం విశేషం. ► అమెరిక ఫిల్మ్ ఇస్టిట్యూట్ టాప్ 10 గ్యాంగ్స్టర్ చిత్రాల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిందీ చిత్రం. ► తొలి భాగం విడుదలైన రెండేళ్లకు ‘ది గాడ్ ఫాదర్ 2’ (12 డిసెంబర్ 1974) మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ది గాడ్ ఫాదర్ 3’ (20 డిసెంబర్ 1990) ఆశించిన ఆదరణకు నోచుకోలేదు. -
భవిష్యత్ అంతా డిజిటల్ అగ్రికల్చర్ దే
-
ఆ కళాశాలకు 50 ఏళ్ల చరిత్ర ఉంది
చదువు చెప్పడమే కాదు..‘కొలువు’ దీరేవరకూ బాధ్యత తీసుకుంటుంది. ఈ కళాశాలలో చదువుకున్న వేల మంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కంచరపాలెంలోని ఉన్నకెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ (గైస్) ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 17వ తేదీనాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు..మరెంతో ఖ్యాతి సొంతం చేసుకుంది. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతోంది. మురళీనగర్ (విశాఖ ఉత్తర): కళాశాల ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక సంస్థగా నిలబడం అంటే మాటలు కాదు. ఇది సాధించాలంటే ఇక్కడ పని చేసే కళాశాల పెద్దలు, సిబ్బందిలో చిత్త శుద్ధి అవసరం. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాళ్లతోపాటు, అధ్యాపకులు, ఇతర కార్యాలయం సిబ్బంది ఈ కాలేజీ ఎదుగుదలలో విశిష్ట సేవలు అందించారు. ప్రాంగణంలో సౌకర్యాల కల్పన, విద్యార్థులకు అందించే ఉత్తమ విద్యలో రాజీ లేకుండా పనిచేయడంతో పాటు కాలేజీ చదువులు ముగిశాక విద్యార్థులకు ఉద్యోగాలు అందించంలో వీరు కృతకృత్యులయ్యారు. దీంతో రాష్ట్రంలోనే ప్రాంగణ నియాయమాకల నిర్వహణ ద్వారా నూరు శాతం ఉద్యోగావకాశాలు కలి్పంచిన కాలేజీగా ఈ ఏడాది గుర్తింపు పొందింది. దీంతో సగర్వంగా నిలదొక్కుకుని 51వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ (గైస్). ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడురోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కంచరపాలెంలోని ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగు కాలేజీ (కెమికల్ ఇంజినీరింగు కాలేజి) 1985లో ఏర్పాటు చేశారు. దీన్ని మొదట్లో గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నిషియన్ కోర్సెస్ (జీఐఏటీసీ)గా ఏర్పాటు చేశారు. 1986లో దీనికి గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టు డిప్లమా కోర్సెస్ ఇన్ ఇంజినీరింగు అండ్ టెక్నాలజీ (జీఐపీడీసీఈ అండ్ టి)గా మార్చారు. మళ్లీ 2008లో గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగు కాలేజీ (కెమికల్ ఇంజినీరింగు కాలేజి)గా పేరు మార్చి దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రాధాన్యత ఇక్కడి కెమికల్ ఇంజినీరింగు కాలేజీ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక కాలేజీగా గుర్తింపు పొందింది. డిప్లమా స్థాయిలో కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన నాలుగు కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీగా ఇదొక్కటే. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, స్టీల్ ప్లాంటు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ఇక్కడి విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్ ఏర్పాటుతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ పార్మాసిటీలో అనేక పార్మా కంపెనీలు ఉన్నాయి. దువ్వాడలోని స్పెషల్ ఎకనమిక్ జోన్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని పారిశ్రామిక కారిడార్స్కు కెమికల్ ఇంజినీరింగు విద్యార్థులు అవసరం ఉంటుంది. ఏఏసీటీఈ గుర్తింపు కాలేజీలో నిర్వహిస్తున్న కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది. నాలుగు కోర్సుల్లో చేరాలంటే పాలిసెట్లో ర్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వార్షిక ఫీజు రూ.3800లు. ఏడాదికి లక్షలోపు ఉన్న బీసీ/ఓసీ విద్యార్థులకు, రెండు లక్షల లోపు ఆదాయ ఉన్న ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు రూ.600లు మాత్రమే ఫీజు చెల్లించే అవకాశం ఉంది. జూన్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి సంవత్సరంలో బేసిక్ సైన్సు, ఇంజినీరింగు సబ్జెక్టులు, రెండో ఏడాదిలో ప్రతి కోర్సుల్లోనూ కెమికల్ ఇంజినీరింగ్తో సంబంధం ఉన్న అల్లీయ్డ్ ఇంజినీరింగు సబ్జెక్టులు మెకానికల్ ఇంజినీరింగు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్తో పాటు వారి స్పెషలైజేషన్ సబ్జెక్టులు (ప్యూర్ బ్రాంచి)బోధిస్తారు. మూడో ఏడాది 5, 6 సెమిస్టర్లో విద్యార్థులను ఇండ్రస్టియల్ ట్రైనింగ్కు పంపిస్తారు. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ (బోట్) పర్యవేక్షణలో జరుగుతుంది. ఇండ్రస్టియల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు రూ.2890 స్టైఫండ్ ఇస్తారు. ఏడవ సెమిస్టర్లో మిగతా అకడమిక్ సబ్జెక్టులు బోధిస్తారు. నవంబర్–అక్టోబర్లో కోర్సు పూర్తవుతుంది. ఉద్యోగాల సాధనలో బాలికల రికార్డు కెమికల్ ఇంజినీరింగ్ కోర్సు చదివితే బాలికలకు ఉద్యోగావశాలు రావనే పాత నమ్మకాలకు పాతర వేసే విధంగా ఈ కాలేజీ నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రతి ప్రాంగణ నియామకాల్లోనూ బాలికలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణ ప్రత్యేక ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఈ కాలేజీల నుంచి 170 మంది ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించగా బాలికలు ఉద్యోగాల సాధనలో అర్ధ సెంచరీ సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. అంతే కాకుండా మల్టీనేషనల్ కంపెనీల్లో వీరు ఉద్యోగాలు సాధించడం మరో కొత్త మలుపుగా చెప్పవచ్చు. ఒక అకడమిక్ సంవత్సరంలో 50 మంది బాలికలు ప్రభుత్వ డిప్లమా ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు సాధించడం ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. దీంతో ఈ కాలేజీకి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఈకాలేజీకి చెందిన ఓ విద్యార్థిని రూ.5.44లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందింది. కెమ్దోసా సహకారం కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (కెమ్దోసా) కాలేజీ అభివృద్ధికి తన వంతుగా సాయం అందిస్తోంది. కాలేజీ ఏర్పాటు చేసి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు, ఆయిల్ టెక్నాలజీ, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, పెట్రోకెమిల్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేసి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. దీనికి కెమ్దోసాతోపాటు ఇతర దాతలు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో మేటి విద్యార్థులు కోర్సు ఆఖరి సంవత్సరంలోనే అనేక రాష్ట్ర, జాతీయ కంపెనీలతోపాటు మల్టీ నేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు పొందుతున్నారు. వీరు 19ఏళ్లకే ప్రారంభంలో రూ.18000–50,000లు నెలవారి జీతాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు కంపెనీల్లో వీరు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. దీంతో ఈ కాలేజీకి డిమాండు పెరిగింది. ప్రాంగణ నియామకాల్లో ఈ కాలేజీకి చెందిన విద్యార్థులు రూ.5.54లక్షల అత్యధిక వార్షిక వేతనం పొందడం గమనార్హం. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతర్, మలేషియా, సింగపూర్లలో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కోర్సుల వివరాలు డిప్లమా స్థాయిలో కెమికల్ ఇంజినీరింగు, పెట్రో కెమికల్ ఇంజినీరింగ్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, ఆయిల్ టెక్నాలజీ విభాగాల్లో ఒక్కొక్క విభాగానికి 60సీట్లు చొప్పున కోర్సులు నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణకు ప్రాధాన్యం విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తయారు చేయడానికి పారిశ్రామిక శిక్షణ, స్కిల్ డవలప్మెంటుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. దీని వల్ల వీరు పాస్అవుట్ కాగానే వివిధ పరిశ్రమాల్లో ఉద్యోగాలు సాధించడానికి వీలవుతుంది. నూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు (హైదరాబాదు), ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ (మెదక్), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ఇస్రో–షార్) (శ్రీహరికోట), కేసీపీ సుగర్స్ అండ్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (వుయ్యూరు), ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ (తణుకు), ఇంటర్నేషనల్ పేపర్స్ లిమిటెడ్ (రాజమండ్రి), పరవాడలోని విజయశ్రీ ఆర్గానిక్స్, వెర్డెంట్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), మైలాన్ ల్యాబరేటరీస్, టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–అచ్చుతాపురం, విశాఖపట్నంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, ఈస్టిండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, విశాఖపట్నం కోఆపరేటివ్ డైరీ, హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ (భెల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్–పైడిభీమవరం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వీరికి పారిశ్రామిక శిక్షణ ఇస్తున్నారు. అందరికీ ఉద్యోగావకాశాలు అందరికీ ఉద్యోగావకాశాలు నినాదంతో పనిచేస్తున్నాం. ఆదిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రణాళిక అమలు చేస్తున్నాం. కాలేజీలో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. నూతన భవన సముదాయం నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసేందుకుందుకు చర్యలు తీసుకున్నాం. త్వరలో ఐఎస్ఓ 9000, ఎన్బీఏ అక్రిడిషన్కోసం వెళ్తాం. ఎన్బీఏ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత ఫెర్టిలైజర్ టెక్నాలజీ కోర్సును ప్రారంభిస్తాం. సేఫ్టీ కోర్సుల హబ్గా తయారు చేస్తాం. ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులు ఉన్నాయి. ఇతర సేఫ్టీ కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాలేజీ ప్రాంగణంలో బాలికల వసతి, భోజన సౌకర్యాల ఏర్పాటుకు అధునాతన భవనం ఉంది. ఇక్కడ 50 మందికి హాస్టల్ సదుపాయం ఉంది. పరిమిత సంఖ్యలో బాలురకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్ సదుపాయం ఉంది. –డాక్టర్ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్ -
వెస్లీ స్వర్ణోత్సవం: దేశ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఒకప్పటి కర్మాగారం
Secunderabad Wesley Boys Jr College Golden Jubilee Celebrations On 2021: నిరుపేదలకు విద్యను అందించాలనే నాటి మిషనరీల సంకల్పం నుంచి ఆవిర్భవించినవే వెస్లీ విద్యా సంస్థలు.18వ శతాబ్ధంలో సికింద్రాబాద్లో ఏర్పాటైన వెస్లీ విద్యా సంస్థల్లో నుంచి పుట్టుకుని వచ్చిన వెస్లీ జూనియర్ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఎందరో విద్య కుసుమాలను దేశానికి అందించడమే కాకుండా క్రీడలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. దేశ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఒకప్పటి కర్మాగారంగా ఉండేది ఈ వెస్లీ జూనియర్ కళాశాల. అంతకు ముందు వెస్లీ పాఠశాలలోనే కలిసి ఉండి 1970 తర్వాత వెస్లీ జూనియర్ కళాశాల మారిన ఈ విద్యా సంస్థ ఈ నెల 7న స్వరోత్సవాలకు సిద్ధమవుతోంది. కార్పొరేట్ పోటీ ప్రపంచంలోనూ తన బ్రాండ్ ఇమేజ్తో సీఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవా నిరతితో ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తుంది. 1853లో ఏర్పాటు 1873లో వెస్లీ హైస్కూల్ గాస్మండిలో ప్రారంభమైంది. 1904లో ప్రస్తుతం పీజీరోడ్లోని ప్రాంగణానికి మార్చారు. నాడు 1 నుంచి 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నందున మల్టీపర్పస్ హై స్కూల్గా పేర్కొనేవారు. 1970లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల, జూనియర్ కళాశాలలను విడదీస్తూ జీవో జారీ చేసింది. దీంతో వెస్లీ జూనియర్ కళాశాలగా ప్రత్యేకంగా ఏర్పాటయ్యింది. ఈ కళాశాల మొట్ట మొదటి ప్రిన్సిపాల్గా టీపీ సదానందం పనిచేశారు. ఆ తర్వాత ఎంజే భాస్కర్రావు, ప్రకాశం తదితర విద్యవేత్తల హయాంలో వెస్లీ జూనియర్ కళాశాల ఒక వెలుగు వెలిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సాధారణ రుసుముతో హాస్టల్ సదుపాయం కల్పించేవారు. క్రీడలు...చదువులో సాటిలేదు వెస్లీ కళాశాలలో సీటు దొరికిందంటే అదృష్టంగా భావించేవారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న ఎంతో మంది ఆయా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. క్రికెట్లో వెస్లీ కళాశాలకు ఏ అకాడమి సాటి వచ్చేది కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఎందరో క్రీడాకారులు ఈ కాలేజీకి చెందిన వారే. శివలాల్యాదవ్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, వంకా ప్రతాప్, ప్రదీప్, విద్యుత్ జయసింహ, వివేక్ జయసింహ, గణేష్, బాస్కెట్ బాల్ ప్లేయర్ డీఎల్ ఇరా>నీ తదితర ప్రముఖులు ఎందరో ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్గౌడ్, మాజీ డీజీపీ బాసిత్ అలీ, ప్రస్తుత సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ ఏసీ సాల్మన్రాజు, మాజీ మంత్రి అల్లాడి రాజ్కుమార్, దుబాయ్ షేక్ వద్ద సలహదారుగా ఉన్న యూనస్ అహ్మద్, యూఎస్లో పేరొందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ గవిని, ప్రస్తుతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ దీన్దయాల్ ఇక్కడ విద్యనభ్యసించిన వారే. 20 మంది కల్నల్స్, 2 బ్రిగేడియర్లుగా మన దేశ సైన్యంలో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే పేరొందిన ఎంతో మంది వ్యాపార వేత్తలు, సీఏలు వందల మంది ఉన్నారు. స్వర్ణోత్సవ సంబురాలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వెస్లీ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ మోజస్ పాల్, పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ నెల 7న సాయంత్రం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ విద్యనభ్యసించి ప్రముఖులు ఇక్కడ పనిచేసిన అధ్యాపకులు, సిబ్బందిని సన్మానించనున్నారు. వెస్లీకి పునర్ వైభవం తెస్తాం వెస్లీ జూనియర్ కళాశాలకు పునర్వైభవం తెచ్చేందుకు యాజమాన్యం, అధ్యాపకులు సమష్టిగా కృషి చేస్తున్నాం. ఇంటర్మీడియేట్ నుంచే ప్రతి విద్యారి్థపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారో అందులో ప్రత్యేక శిక్షణ అందిస్తాం. ఎంసెట్, ఐఐటీ, జీ లాంటి వాటితో పాటు సివిల్స్, గ్రూప్స్ కోసం ఐ విన్ సొల్యూషన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. క్రీడలు, ఎన్సీసీపై ప్రత్యేక దృష్టి పెట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ దిశగా ఫలితాలు వస్తున్నాయి. జాతీయ స్థాయి క్రికెట్, కబడ్డీ, జూడో క్రీడాకారులు కాలేజీలో ఉన్నారు. –డాక్టర్ మోజస్ పాల్, ప్రిన్సిపాల్ వెస్లీ కాలేజ్ -
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నేనే..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరోమారు చాటుకున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఓ శిబిరంగా, శశికళ నేతృత్వంలో మరో శిబిరంగా అన్నాడీఎంకే కేడర్ విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధులను శనివారం శశికళ సందర్శించి నివాళులరి్పంచిన విషయం తెలిసిందే. ఆదివారం అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని చాటుకునే ప్రయత్నం శశికళ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏకమవుదాం.. పార్టీని గెలిపిద్దాం పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. శశికళ నేతృత్వంలో చెన్నై టీనగర్లోని ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అని రాసి ఉంది. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. ముందుగా టీనగర్లో జరిగిన సేవా కార్యక్రమంలో శశికళ మాట్లాడారు. అందరం ఏకం అవుదాం.. అన్నాడీఎంకేను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఎంజీఆర్, జయలలిత తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని, ఈ వైభవం మళ్లీ రావాలంటే అందరం ఒక్కటి కావాలి్సందేనని స్పష్టం చేశారు. తనను గతంలో సమస్యలు చుట్టుముట్టినా, అన్నాడీఎంకేకు చెందిన వారినే ప్రభుత్వ పాలనలో కూర్చోబెట్టానని పరోక్షంగా పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడు, తమిళ ప్రజలే తనకు ముఖ్యమని.. ఎంజీఆర్, అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమని తేల్చిచెప్పారు. అయితే, శశికళ చర్యలను అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తుచేశారు. శిలాఫలకంలో ఆమె పేరును ఎలా పొందుపరిచారు? అని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కార చర్య అని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఇంటర్ విద్యకు 50 ఏళ్లు
ఉన్నత విద్యకు వారధిగా ఉండే ఇంటర్ విద్యకు 50 ఏళ్లు వచ్చాయి. 1968లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమయ్యింది. దీనికోసం ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ బి.ఉదయలక్ష్మి షెడ్యూల్ను ఖరారు చేశారు. 26వ తేదీ నుంచి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్: 1968కి ముందు ఇంటర్ స్థానంలో 11, 12 తరగతులుగా పాఠశాల విద్య బోర్డు కింద ఉండేది. అప్పట్లో పాఠశాల విద్య, ఉన్నత విద్యగా విద్యావిధానం ఉండేది. విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 10+2+3 విద్యా విధానాన్ని తీసుకురావాలని కొటారి కమిషన్ సూచించింది. దీంతో పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను తీసుకురావాలని నిశ్చయించారు. అలా 1968లో తొలిసారిగా 11, 12 తరగతుల స్థానంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యను ప్రవేశపెట్టారు. పాఠశాల విద్య స్థానంలో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యామండలిని 1969లో ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యకు వారధి ఇంటర్ ఉన్నత విద్యకు వారధిగా ఇంటర్ విద్య నిలుస్తోంది. ఇంటర్ విద్యలో ప్రతిభ కనబరిస్తేనే ఉన్నత విద్యలోకి అడుగులు వేయాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన ఇంటర్ విద్య ఉన్నత విద్యలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ను రూపొందించి, విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేస్తోంది. ఇంటర్ విద్య వచ్చినప్పటి నుంచి విద్యావిధానంలో సమూల మార్పులు వచ్చాయని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ ఉన్నత విద్యకు బంగారు బాటలు వేయడానికి ఇంటర్ విద్య దోహదపడుతోందని చెబుతున్నారు. స్వర్ణోత్సవాల సంబరాలు ఇంటర్ విద్యను ప్రవేశపెట్టి 50ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఇంటర్ విద్య బోర్డు స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంటర్ విద్య ప్రాముఖ్యత, ఔన్నత్యంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలను నిర్వహించనుంది. జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనుంది. పోటీలతో పాటు ఆయా కళాశాలలున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీలు చేపట్టనుంది. దీనికోసం షెడ్యూల్ను ఇంటర్ విద్య విడుదల చేసింది. 26 నుంచి పోటీలు స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు పండుగ వాతావరణాన్ని తలపించేలా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. వ్యాసరచన, వక్తృత్వ, ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు ఆయా కళాశాలల్లోనే నిర్వహించి, విజేతలను ఎంపిక చేస్తారు. వీటిని పరిశీలించి, విజేతలను ఎంపిక చేసి డిసెంబర్ 3నుంచి 7వ తేదీ వరకు జరిగే జోనల్ స్థాయి పోటీలకు, అక్కడ గెలుపొందిన వారికి 10 నుంచి 15వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో సంబరాలు నిర్వహించనున్నారు. స్వర్ణోత్సవ కమిటీ జిల్లావ్యాప్తంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అన్ని యాజమాన్య కళాశాలల్లో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు. స్వర్ణోత్సవ వేడుకలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 9మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి కన్వీనర్గా ఆర్ఐఓ/డీవీఈఓ, ముగ్గురు ప్రిన్సిపాల్స్, ముగ్గురు జూనియర్ లెక్చరర్లు, ఒక ఫిజికల్ డైరెక్టర్, ఒక లైబ్రేరియన్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. స్వర్ణోత్సవాలు జరుపుకోవాలి ఇంటర్ విద్య ఔన్నత్యాన్ని చాటేలా స్వర్ణోత్సవాలు జరుపుకోనున్నాం. ఈనెల 26వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 275 అన్ని యాజ మాన్య జూనియర్ కళాశాలల్లో పండుగ వాతావరణం తలపించేలా సంబరాలు నిర్వహించాలి. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి పంపించాలి. ప్రతి కళాశాలలోనూ తప్పనిసరిగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలి.–ఎం.కృష్ణయ్య, ఇంటర్ ప్రాంతీయపర్యవేక్షణాధికారి, తిరుపతి -
కేయూ బోటనీ విభాగానికి త్వరలో 50 వసంతాలు పూర్తి
కేయూ క్యాంపస్‌ : కేయూ బోటనీ విభాగం స్వర్ణోత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 9వతేదీతో ఆ విభాగం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆ విభాగం ఆచార్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. ఎమ్మెస్సీ బాటనీ రెండు సంవత్సరాల కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ పరి«ధిలో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌కళాశాల పీజీసెంటర్‌లో 1968లో ఏర్పాటుచేశారు. ఆ విభాగం ఇన్‌చార్జిగా అప్పట్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యావతి వ్యవహరించారు. అప్పట్లో 12 మంది విద్యార్థులతో ఆరంభమైన ఈ విభాగంను 1970లో న్యూ క్యాంపస్‌కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ 1976 అగస్టు 19న ఆవిర్భవించిన విషయం విధితమే. కేయూ ఆవిర్భావం తర్వాత క్యాంపస్‌లోనూ అదే బాటనీ విభాగం కొనసాగుతోంది. 1986లో ఈ విభాగాన్ని కొత్త భవనంలోకి మార్చారు. అన్నిరకాల మౌళిక సదుపాయాలు... సరిపడా క్లాస్‌రూమ్‌లు , ల్యాబరేటరీ వసతి, పచ్చదనంతో బోటనీ బ్లాక్‌ కళకళాడుతోంది. ఈ విభాగంలో మొదటి బ్యాచ్‌ విద్యార్థులు డాక్టర్‌ కె.సుభాష్, డాక్టర్‌ ఎన్‌.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ సిసువర్తా లాంటి వారు ఇక్కడే అదే విభాగంలో ఆచార్యులుగా విద్యా, పరిశోధనాపరమైన సేవలను అందించారు. ఇదేవిభాగంలో పనిచేసిన ఆచార్య విద్యావతి, డాక్టర్‌ జాఫర్‌ నిజాం కాకతీయ యూనివర్సిటీ వీసీలు గా కూడా పనిచేసి యూనివర్సిటీ అభివృద్ధితోపాటు బాటనీ విభాగం అభివృద్ధికి ఎంతో కృషిచేశారనడంలో అతిశయోక్తిలేదు. 40 బ్యాచ్‌లు, 1500 మంది విద్యార్థులు ఎమ్మెస్సీ బోటనీ విభాగంలో 50 సంవత్సరాల్లో ఇప్పటివరకు 40 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 1500ల మంది విద్యార్థులు ఈ విభాగంలో పట్టాలు పొందారు. 268మంది వివిధ అంశాలపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌లు పొందారు. 20మంది ఎంఫిల్‌ డిగ్రీ పొందారు. మిగతా విభాగాల కంటే బోటనీలోనే ఎక్కువమంది డాక్టరేట్‌లు పొందడం విశేషం. ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు.. ఈ విభాగంలో చదువుకున్న పూర్వవిద్యార్థులలో ఎక్కువ శాతం మంది ఇంటర్, డిగ్రీ , పీజీ కళాశాలల్లో లెక్చరర్లుగా నూ.. మరి కొందరు ఇతర దేశాల్లోనూ స్ధిరపడ్డారు. ఇంకొంతమంది ప్రభుత్వ రంగ సర్వీస్‌లలో.. (ఐఏఎస్, ఐఎఫ్‌ ఎస్, బోటనీ సర్వే ఆఫ్‌ ఇండియా) ఉద్యోగాలు చేస్తున్నారు. పరిశోధనలపరంగా ముందంజ.. బోటనీ విభాగం పరిశోధనపరంగా ముందంజలో ఉంది. రీసెర్చ్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1500 రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌ను వివిధ జర్నల్స్‌లోనూ ప్రచురించారు. సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ బీరహుదూర్, ప్రొఫెసర్‌ ఎస్‌ఎం రెడ్డి పలు టెక్స్స్టబుక్స్‌ కూడా రాశారు. మరికొందరు అధ్యాపకుల రచనలను ప్లస్‌ 2, డిగ్రీ స్టూడెంట్స్‌ ఇన్‌ వెర్నాక్యులర్‌ లాంగ్వెజెస్‌లో తెలుగు అకాడమీ ప్రచురించింది. యూజీసీ, ఏఐసీటీఈ, డీబీటీ, ఐసీఎంఆర్, డీఓఎఫ్‌ఈ తదితర సంస్థల సహకారంతో ఈ విభాగంలో పలు మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయి. యూజీసీ సహకారంతో సాప్‌ (స్పెషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం)కింద డీఆర్‌ఎస్‌–1,2,3 దశల్లోనూ కేవలం బోటనీ విభాగంలోనే పరిశోధనలు కొనసాగటం గమనార్హం. ఈ విభాగంలో సాప్‌ కింద పరిశోధనల కోసం మొత్తంగా రూ.2.43కోట్లు మంజూరుకాగా.. డీఎస్‌టీ కింద రూ.1.05 కోట్లు నిధులు ఫిస్ట్‌ ప్రోగ్రాంకు మంజూరయ్యాయి. అంతే కాకుండా బోటనీ విభాగం పలు జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లకు కూడా వేదికైంది. సంవత్సరమంతా స్వర్ణోత్సవాలు యూనివర్సిటీలోని బోటనీ విభాగం ఆ«ధ్వర్యంలో గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు సంవత్సరం పొడవునా నిర్వహించనున్నారు. అందుకోసం తొలుత ఈ నెల 9న ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఢిల్లీ), డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ డాక్టర్‌ టి మహాపాత్ర , తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి పాపిరెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఏఆర్‌ రెడ్డి, తెలంగాణ ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌కుమార్, కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, బోటనీ విభాగం పూర్వ విద్యార్థి మహబూబాబాద్‌ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్‌ సైతం పాల్గొంటారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 10న బోటనీ విభాగం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.అంతేగాకుండా పూర్వవిద్యార్థులలో అత్యున్నతస్థాయి వ్యక్తులను, గురువులను సన్మానించనున్నారు. విభాగం సెమినార్‌ హాల్‌లో రెండు సెషన్లలో పూర్వ విద్యార్థులు, వివిధసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు ఎంవీ రాజమ్, ప్రొఫెసర్‌ లీలా సెహజిరాన్, ప్రొఫెసర్‌ శ్రీనాథ్, డాక్టర్‌జీవీఎస్‌ మూర్తి, డాక్టర్‌ పి గిరి«ధర్‌ , డాక్టర్‌ కేఆర్‌కే రెడ్డి పాల్గొని పలు అంశాలపై ప్రసంగిస్తారు. ఎంపీ సీతారాంనాయక్‌ కూడా పూర్వ విద్యార్థే.. బోటనీ విభాగం పూర్వ విద్యార్థి, అంతేగాకుండా ఇక్కడే ఈ విభాగంలోనే అచార్యులుగా పనిచేసిన ఆజ్మీరా సీతారాంనాయక్‌ మహబూబాబాద్‌ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇదే విభాగంలో అచార్యులుగా పనిచేసిన జాఫర్‌ నిజాం రెండు సార్లు కేయూకు వీసీగా పనిచేశారు. అలాగే ఆచార్యులుగా పనిచేసిన విద్యావతి కూడా కేయూకు వీసీగా పనిచేశారు. మరికొందరు అధ్యాపకులుగా పనిచేస్తూనే రిజిస్ట్రార్, డీన్స్, పరీక్షల నియంత్రణా«ధికారులుగా తదితర బాధ్యతలను నిర్వహించారు. బోటనీ విభాగాన్ని విస్తరించి బీఎస్సీ ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బీఎస్సీ బఝెటెక్నాలజీ, అలాగే సుబేదా రిలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌కళాశాలలో ఎమ్మెస్సీ బాటనీ విభా గం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. ఎస్‌డీఎల్‌సీఈ పరి« దిలో ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్‌ను కూడా కొనసాగిస్తున్నారు. అతిథులతో పైలాన్‌ ఆవిష్కరణ గోల్డెన్‌ జుబ్లి ఉత్సవాల సందర్భంగా రూ. 1.25లక్షలతో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని అతిథులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా 200 పేజీలతో పూర్వవిద్యార్థులు, పీహెచ్‌డీ, ఎంఫిల్, రీసెర్చ్‌ప్రాజెక్టులు తదితర వివరాలతో కూడిన వాల్యూమ్‌ను కూడా ఆవిష్కరించనున్నారు.పూర్తికావొస్తున్న ఏర్పాట్లుకాకతీయ యూనివర్సిటీలో బోటనీ విభాగం గోల్డెన్‌జూబ్లీ వేడుకలు ఈనెల 9న ప్రారంభమవుతాయి ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈ ఉత్సవాలను పూర్వ విద్యార్థులు అధ్యాపకులు, పరిశోధకులు విజయవంతం చేయాలి. విభాగంలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నాం. తొలిరోజు 9న ఉదయం క్యాంపస్‌లో ప్రొసిషన్‌ కూడా ఉంటుంది. ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. పూర్వవిద్యార్థుల సమావేశం కూడా ఉంటుంది.. సంవత్సరం పొడుగునా ఉత్సవాలు ఉంటాయి. ఈనెల 10న పలు కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల పర్యవేక్షకులుగా రిటైర్డ్‌ ఆచార్యులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు ప్రొఫెసర్‌ ఎస్‌ రాంరెడ్డి, ఆజ్మీరా రాగన్, డాక్టర్‌ వి కృష్ణారెడ్డి, డాక్టర్‌ టి క్రిష్టోఫర్, డాక్టర్‌ ఎండీ ముస్తాఫా, డాక్టర్‌ ప్రొలారామ్, ప్రొఫెసర్‌ ఏ సదానందం తదితరులు వ్యవహరిస్తున్నారు. – డాక్టర్‌ ఎం సురేఖ, కేయూ బోటనీ విభాగం అధిపతి -
మహా సాగరంలో కల్వరి అద్భుతం
న్యూఢిల్లీ : మహా సాగరంలో ఐఎన్ఎస్ కల్వరి అద్భుత విన్యాసాల వీడియోను భారతీయ నేవీ విడుదల చేసింది. జల ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగరంలో కల్వరి ట్రయల్స్ను విడుదల చేస్తున్నట్లు నేవీ పేర్కొంది. భారత్ అమ్ములపొదిలో ఉన్న నాన్ న్యూక్లియర్ సబ్మెరైన్లలో కల్వరి అత్యంత శక్తిమంతమైనది. ఫ్రాన్స్ దేశం డిజైన్ చేసిన స్కార్పిన్ తరగతికి చెందిన కల్వరిని ఈ నెల ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేవీలోకి కమిషన్ చేసి, జాతికి అంకితం చేశారు. వాస్తవానికి కల్వరిని 1967లో నేవీలోకి కమిషన్ చేశారు. 30 ఏళ్ల సేవల అనంతరం 1996 మే 31న కల్వరిని నేవీ డీ కమిషన్ చేసింది. అయితే, ప్రాజెక్టు -75లో భాగంగా ఆరు స్కార్పిన్ తరగతికి చెందిన సబ్మెరైన్లను డిజైన్ చేసేలా ఫ్రాన్స్-భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో వాటి శ్రేణిలో వచ్చిన తొలి సబ్మెరైన్కు ‘కల్వరి’ అని నామకరణం చేశారు. 2015లో ట్రయల్స్ కోసం తొలిసారి కల్వరి జల ప్రవేశం చేసింది. కల్వరికి 50 పూర్తి కావడంతో ట్రయల్స్లో అది చేసిన అద్భుతాలను నేవీ విడుదల చేసిన వీడియోలో చూపింది. సముద్ర లోతుల్లో తిరుగులేని చేపగా పేరున్న టైగర్ షార్క్ను దృష్టిలో పెట్టుకుని కల్వరి అనే పేరును పెట్టారు. డిజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్తో నడిచే కల్వరి అతి తక్కువ శబ్దం చేస్తూ శత్రువుల రేడార్కు దొరకదు. అంతేకాకుండా కల్వరి సముద్ర అంతర్భాగం నుంచి ఉపరితలం మీదుగా క్షిపణులను ప్రయోగించగలదు. 2020 కల్లా ప్రాజెక్టు - 75 కింద రూపొందే సబ్ మెరైన్లు అన్ని నేవీ చేతికి అందనున్నాయి. -
కల్వరి అద్భుత విన్యాసాలు
-
75వ యేట అడుగుపెట్టిన OBC సంస్థ
-
ఉత్సవం.. ఉత్సాహం..
-
ఘనంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్