మహా సాగరంలో ఐఎన్‌ఎస్ కల్వరి అద్భుత విన్యాసాల వీడియోను భారతీయ నేవీ విడుదల చేసింది. జల ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగరంలో కల్వరి ట్రయల్స్ నిర్వహించిన వీడియోను విడుదల చేస్తున్నట్లు నేవీ పేర్కొంది. భారత్ అమ్ములపొదిలో ఉన్న నాన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్లలో కల్వరి అత్యంత శక్తిమంతమైనది.