Ram Gopal Varma: The Godfather completes 50 years Details Inside - Sakshi
Sakshi News home page

RGV: ది గాడ్‌ ఫాదర్@ 50 ఏళ్లు

Published Sun, Mar 13 2022 1:39 AM | Last Updated on Sun, Mar 13 2022 8:06 AM

The Godfather completes 50 years - Sakshi

అతను.. మంచోళ్లకు మంచోడు... చెడోళ్లకు చెడ్డోడు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘గాడ్‌ ఫాదర్‌’. అన్యాయం చేసేవాళ్లకు ‘టెర్రర్‌’. 50 ఏళ్ల క్రితం సిల్వర్‌ స్క్రీ పైకి వచ్చిన ‘ది గాడ్‌ ఫాదర్‌’ ఎన్నో ప్రపంచ సినిమాల స్క్రీప్లేకి ఆదర్శమైంది. 1972 మార్చిలో విడుదలైన ‘ది గాడ్‌ ఫాదర్‌’ గోల్డె జూబ్లీ ఇయర్‌లోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమా ‘శివ’కు ముందు ఆ తర్వాత అనేలా ట్రెండ్‌ని మార్చిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ది గాడ్‌ ఫాదర్‌’ గురించి చెప్పిన విశేషాలు.

నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్‌ ‘గాడ్‌ఫాదర్‌’ నవల ఇచ్చి, అందులో 26వ పేజీ చదవమన్నాడు. ఆ పేజీ చదివాక పుస్తకం బ్యాక్‌ కవర్‌పై ‘మాఫియాను గురించిన పుస్తకం ఇది’ అని రాసి ఉండటం చూశాను. అప్పటివరకూ మాఫియా అనేదాని గురించి నేను విన్నది లేదు. ఆసక్తితో పుస్తకాన్ని చదవడం స్టార్ట్‌ చేశాను. ఆ బుక్‌లోని క్యారెక్టరైజేషన్స్, అందులోని డ్రామా, ఆ బుక్‌ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించాయి.

వెంటవెంటనే మూడునాలుగుసార్లు చదివాను. చదవడం పూర్తి చేసిన ప్రతిసారీ ఏవో కొత్త విషయాలు తెలిశాయన్న ఫీల్‌ కలిగేది. స్టోరీ టెల్లింగ్‌పై నాకు ఆసక్తి కలగడానికి ‘గాడ్‌ ఫాదర్‌’ పుస్తకం, ఆ తర్వాత ఆ పుస్తకం ఆధారంగా వచ్చిన సినిమాయే నాలో స్ఫూర్తిని నింపినట్లుగా నాకనిపిస్తుంటుంది. నేను దర్శకుడిగా మారాక ఓ సీ కోసమో, డైలాగ్‌ కోసమో... ఇలా పలు విషయాలకు ‘గాడ్‌ ఫాదర్‌’ పుస్తకాన్ని రిఫరెన్స్‌లా వినియోగించుకున్నాను.

► ‘సర్కార్‌’ కోసం అమితాబ్‌ బచ్చని కలిసినప్పుడు ‘ది గాడ్‌ ఫాదర్‌’ సినిమా అడాప్ష గురించిన ఆలోచన నాకు కలిగింది. నిజానికి ‘ది గాడ్‌ ఫాదర్‌’ సినిమా పూర్తి స్థాయి మాఫియా డా గురించి కాదేమో! వీటో కార్లియో (‘ది గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో మార్ల బ్రాండో చేసిన డా పాత్ర)లాంటి స్వభావం ఉన్నవారు మాఫియా రంగంలోనే కాదు.. పొలిటికల్, మెడికల్‌ వంటి రంగాల్లోనూ ఉన్నారు. ఇలాంటి వారు తమ పవర్, స్వభావాలతో ఏమైనా చేయగలరు. ఇండియా విషయానికి వస్తే.. పొలిటికల్‌గా నాకు బాల్‌ థాక్రే అలా కనిపిస్తారు. ఆయన చరిష్మా ఎలాంటిదంటే అధికారికంగా ఆయన ఏ పొజిషలో లేకపోయినా.. ఆయన కోసం చంపేవాళ్ళతో పాటు చనిపోయేవాళ్లూ ఉండేవారు.

► ‘ది గాడ్‌ ఫాదర్‌’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం స్క్రిప్ట్, క్యారెక్టర్స్, డైరెక్ష... ఇలా ప్రత్యేకంగా ఏ ఒక్క అంశాన్నో చెప్పలేం. ఈ చిత్రంలో మార్ల బ్రాండో ప్రధాన పాత్రధారిగా కనిపించి ఉండొచ్చు కానీ సినిమాలోని ఏ క్యారె క్టరూ మర్చిపోలేని రీతిలో ఉంటుంది. ‘ది గాడ్‌ ఫాదర్‌’ కెమెరామ్యా గోర్డా విల్లీస్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ నినారోట, రచ యిత మారియో çప్యూజో, దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కప్పోలా.. వారి కెరీర్‌లో చాలా చిత్రాలు చేసి ఉండొచ్చు కానీ ‘ది గాడ్‌ ఫాదర్‌’కు కుదిరినట్లుగా వారి పనితనం మరే సినిమాకూ కుదర్లేదేమో!

► అప్పట్లో క్రిమినల్స్‌ ఆహార్యం కాస్త భయం కలిగించేలా ఉండేది. కానీ ‘ది గాడ్‌ ఫాదర్‌’లో మాత్రం మనవారో, మన చుట్టుపక్కలవారో క్రిమినల్స్‌ అన్నట్లుగా చూపించారు. అందుకే ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ రిలేట్‌ అయ్యారు. మనందరి మధ్యలోనే ఉండే రాక్షసులకు ప్రతిరూపంలా నిలిచిన చిత్రంగా ‘ది గాడ్‌ ఫాదర్‌’ను చెప్పుకోవచ్చు.

 

► ‘ది గాడ్‌ ఫాదర్‌’ చిత్రం ఓ తరగని నిధి వంటిది. ఈ మూవీలోని పాత్రల్లో విభిన్నమైన పార్శా్వలు ఉంటాయి. మనుషుల భావోద్వేగాలు ఉన్నంతకాలం ఈ పార్శా్వల నుంచి కొత్త అంశాలను ఆవిష్కరించుకోవచ్చు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఆధారంగా కొత్త చిత్రాలు తీయొచ్చన్నది నా అభిప్రాయం.

► ‘ది గాడ్‌ ఫాదర్‌’ చిత్రాన్ని అమెరిక రచయిత మారియో ప్యూజో రాసిన ‘గాడ్‌ ఫాదర్‌ బుక్‌ ఆధారంగా తీశారు. అలాంటి పుస్తకాలు ఇండియాలో ఈ రోజుల్లో వస్తాయని నేను అనుకోవడం లేదు. పైగా నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్న ఈ రోజుల్లో పుస్తక పఠనానికి పూర్వవైభవం దక్కుతుందా? అనే అనుమానం ఉంది నాకు.

 

► ‘గాడ్‌ ఫాదర్‌’ నవలను ‘ది గాడ్‌ పాదర్‌’ చిత్రంలో పూర్తిగా వెండితెరపై ఆవిష్కరించబడలేదు. ఒక పుస్తకం సోల్‌ను కేవలం రెండున్నర గంటల్లో వెండితెరపై చూపించడం అనేది ఎవరికైనా క్లిష్టతరమైన పని. కానీ ‘గాడ్‌ఫాదర్‌’ నవలలోని కథను వెండితెరపైకి తీసుకురావడంలో దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కప్పోలా  చాలావరకు విజయం సాధించారనే అనుకుంటున్నాను.
 


‘ది గాడ్‌ ఫాదర్‌’ కథేంటంటే...
న్యూయార్క్‌ నగరానికి చెందిన డా విటో కోర్లియో (మార్ల బ్రాండో) తిరుగు లేని డా. ప్రజల కష్టాలు తీర్చే మంచి డా. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో అక్రమార్కులను అంతం చేసే డా. ‘మంచి డా’... ‘నేర చరిత్ర’ ఉన్న డా. విటోకి ముగ్గురు కొడుకులు, ఒక పెంపుడు కొడుకు,   సలహాదారు టామ్‌ హేగ (రాబర్ట్‌ డువల్‌), ఒక కూతురు కాన్నీ (టాలియా షైర్‌) ఉంటారు. పెద్ద కొడుకు సన్నీ (జేమ్స్‌ కా), రెండోవాడు ఫ్రెడో (జా కజేల్‌), మూడోవాడు మైఖేల్‌ (అల్‌ పచీనో). సన్నీ, మైఖేల్‌ చురుకైనవాళ్లు.

తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు సన్నీ. మైఖేల్‌కి ఈ వ్యాపారం నచ్చదు. పైగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటాడు. అతని గర్ల్‌ ఫ్రెండ్‌ ఆడమ్స్‌ (డయానే కీట) కి తండ్రి నేర చరిత్ర చెప్పి, తాను అటువంటి వాడిని  కాదంటాడు. పైగా తమ వ్యాపారాలను చట్టబద్ధం చేస్తానని ఆమెకు మాట కూడా ఇస్తాడు. అయితే శత్రు మాఫియా కుటుంబం అయిన టటాలియా మద్దతు మెండుగా ఉన్న సొలోజ్జో వల్ల కథ వేరే మలుపు తిరుగుతుంది. సినిమా చివర్లో మైఖేల్‌నే అనుచరులు కొత్త డా గా గౌరవిస్తారు. అతని చేతిని ముద్దాడతారు.

కొన్ని విశేషాలు
► ‘ది గాడ్‌ ఫాదర్‌’కి డైరెక్ష చేయమని పారామౌంట్‌ పిక్చర్స్‌ పన్నెండు మంది దర్శకులను సంప్రదిస్తే ఎవరూ ముందుకు రాలేదు. కప్పోలా కూడా నవల చవకబారుగా ఉందని, సినిమా చేయలేనని ముందు నిరాకరించారు. అయితే అప్పటికే నిర్మాతగా కప్పోలా తీసిన రెండు చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో, ఆ అప్పులు తీర్చడం కోసం ఈ సినిమా చేశారు. ∙టైటిల్‌ రోల్‌కి మార్ల బ్రాండో స్థానంలో వేరే నటుడిని తీసుకోవాలన్నది నిర్మాతల ఆలోచన. అంతకుముందు చిత్రాల్లో బ్రాండోకి ఉన్న సమస్యల వల్ల అలా అనుకున్నారు. అయితే బ్రాండోనే కావాలని పట్టుబట్టారు దర్శకుడు. చివరికి స్క్రీ టెస్ట్‌కి ఆమోదించాలని, నిర్మాణానికి ఆటంకాలు కలిగించకూడదని ఒప్పందం చేసుకున్నాకే బ్రాండోని తీసుకున్నారు.

► స్క్రీ టెస్ట్‌ అప్పుడు బుగ్గలు నిండుగా కనిపించడానికి మార్ల్లని నోట్లో టిష్యూ పేపర్లు ఉంచుకుని, డైలాగ్‌ చెప్పమని, ఓ మూడు సీన్లు తీశారు కప్పోలా. అవి చూశాక నిర్మాతలు మరో మాట మాట్లాడకుండా మార్లని ఓకే చేశారు.

► ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీ ప్లే.. ఇలా మొత్తం 11 విభాగాలలో ఆస్కార్‌ అవార్డులకు నామినేష దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీ ప్లే విభాగాల్లో అవార్డు దక్కించుకుంది.

► ఆస్కార్‌ అవార్డుని మార్ల బ్రాండో తిరస్కరించి, అవార్డు వేడుకకు హాజరు కాలేదు. అయితే 4 పేజీల ఉత్తరాన్ని బాలనటì  సచీ లిటిల్‌ ఫెదర్‌తో పంపారు. మార్లకి అవార్డు ప్రకటించగానే, ఆ బాలనటి వేదిక మీదకు వెళ్లి, అమెరికాలోని స్థానిక రెడ్‌ ఇండియన్ల పట్ల హాలీవుడ్‌ పరిశ్రమ వివక్ష చూపెడుతున్నందుకు నిరసనగా మార్ల అవార్డుని తిరస్కరించారని పేర్కొని, ఆ ఉత్తరాన్ని విలేకరులకు అందజేసింది.

► దాదాపు ఏడు మిలియ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం సుమారు 280 మిలియ డాలర్లు వసూలు చేయడం విశేషం.

► అమెరిక ఫిల్మ్‌ ఇస్టిట్యూట్‌ టాప్‌ 10 గ్యాంగ్‌స్టర్‌ చిత్రాల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిందీ చిత్రం.

► తొలి భాగం విడుదలైన రెండేళ్లకు ‘ది గాడ్‌ ఫాదర్‌ 2’ (12 డిసెంబర్‌ 1974) మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ది గాడ్‌ ఫాదర్‌ 3’ (20 డిసెంబర్‌ 1990) ఆశించిన  ఆదరణకు నోచుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement