సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌లో ‘గోల్డెన్‌ జూబ్లీ’  | St Pauls High School Golden Jubilee Celebrations In Hyderguda | Sakshi
Sakshi News home page

సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌లో ‘గోల్డెన్‌ జూబ్లీ’ 

Published Mon, Feb 5 2024 5:42 AM | Last Updated on Mon, Feb 5 2024 2:13 PM

St Pauls High School Golden Jubilee Celebrations In Hyderguda  - Sakshi

1973 బ్యాచ్‌ విద్యార్థులు

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): హైదర్‌గూడలోని సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌లో పదోతరగతి(1973 బ్యాచ్‌) చదివి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి విద్యార్థులు గోల్డెన్‌ జూబ్లీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఆదివారం ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులతా పాఠశాల ప్రాంగణంలో ఒకచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్‌ కోఆర్డినేటర్‌ వీరస్వామి మాట్లాడుతూ తమ బ్యాచ్‌లో 140 మంది విద్యార్థులుండగా, 75మంది వస్తారని అనుకున్నామని, 62 మంది గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. అమెరికా, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురు, ఒకరు కోల్‌కతా నుంచి రావడం ఆనందంగా ఉందన్నారు. కమిటీ ప్రతినిధులు కెబీఎంఎం.క్రిష్ణ, వి.కిషోర్, కోకా వెంకటరమణ, వి.రమేష్‌ పాల్గొన్నారు. 

గురువులకు సన్మానం  
విద్యాబుద్ధులు నేర్చిన తొమ్మిది మంది గురువులు, ప్రస్తుత ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మజర్‌అలీ అహ్మద్‌ను 1973 బ్యాచ్‌ విద్యార్థులు ఘనంగా సత్కరించారు.  

పాఠశాల అభివృద్ధికి రూ. 40 లక్షలు విరాళం 
1973 బ్యాచ్‌కు చెందిన ప్రొఫెసర్‌ సుధాకర్, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చల్లా కిషోర్, అతని నలుగురు సోదరులతో కలిసి పాఠశాల కొత్త భవనం కోసం రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement