st paul school team
-
సెయింట్ పాల్స్ స్కూల్లో ‘గోల్డెన్ జూబ్లీ’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్లో పదోతరగతి(1973 బ్యాచ్) చదివి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఆదివారం ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులతా పాఠశాల ప్రాంగణంలో ఒకచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్ కోఆర్డినేటర్ వీరస్వామి మాట్లాడుతూ తమ బ్యాచ్‌లో 140 మంది విద్యార్థులుండగా, 75మంది వస్తారని అనుకున్నామని, 62 మంది గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. అమెరికా, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఒకరు కోల్‌కతా నుంచి రావడం ఆనందంగా ఉందన్నారు. కమిటీ ప్రతినిధులు కెబీఎంఎం.క్రిష్ణ, వి.కిషోర్, కోకా వెంకటరమణ, వి.రమేష్ పాల్గొన్నారు. గురువులకు సన్మానం విద్యాబుద్ధులు నేర్చిన తొమ్మిది మంది గురువులు, ప్రస్తుత ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మజర్అలీ అహ్మద్‌ను 1973 బ్యాచ్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి రూ. 40 లక్షలు విరాళం 1973 బ్యాచ్‌కు చెందిన ప్రొఫెసర్ సుధాకర్, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చల్లా కిషోర్, అతని నలుగురు సోదరులతో కలిసి పాఠశాల కొత్త భవనం కోసం రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు. -
లయోలా, సెయింట్ పాల్స్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎంసీఏ నిర్వహించిన ఇండిపెండెన్స్ కప్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో లయోలా కాలేజీ, సెయిం ట్ పాల్స్ స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. సికింద్రాబాద్ వైఎంసీఏ మైదానం లో జరిగిన మహిళల ఫైనల్లో లయోలా జట్టు 36–20 స్కో రుతో సెయింట్ పాయిస్పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సెయింట్ పాయిస్ 31–25తో బ్లూ క్రూసేడర్స్పై గెలిచింది. బాలుర ఈవెంట్లో సెయింట్ పాల్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో సెయింట్ పాల్స్ 34–33తో కేంద్రీయ విద్యాలయ (కేవీ, పికెట్)ను కంగుతినిపించింది. సెమీఫైనల్లో సెయింట్ పాల్స్ 16–12తో లిటిల్ ఫ్లవర్ జట్టుపై, కేవీ పికెట్ 20–15తో డైర్ వోల్వస్పై నెగ్గాయి. పురుషుల తుదిపోరులో ఈగల్ 52–44తో ఎయిర్ బౌర్న్పై విజయం సాధించింది. సెమీస్‌లో ఈగల్ 40–35తో బెంచ్ వార్మర్స్ యునైటెడ్‌పై, ఎయిర్ బౌర్న్ 45–40తో ఎన్‌పీఏపై గెలిచాయి. వైఎంసీఏ కార్యదర్శి లియోనార్డ్ మైరాన్, కిరణ్ కుమార్ విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు.