లయోలా, సెయింట్ పాల్స్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎంసీఏ నిర్వహించిన ఇండిపెండెన్స్ కప్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో లయోలా కాలేజీ, సెయిం ట్ పాల్స్ స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. సికింద్రాబాద్ వైఎంసీఏ మైదానం లో జరిగిన మహిళల ఫైనల్లో లయోలా జట్టు 36–20 స్కో రుతో సెయింట్ పాయిస్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సెయింట్ పాయిస్ 31–25తో బ్లూ క్రూసేడర్స్‌పై గెలిచింది. బాలుర ఈవెంట్‌లో సెయింట్ పాల్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది.
ఫైనల్లో సెయింట్ పాల్స్ 34–33తో కేంద్రీయ విద్యాలయ (కేవీ, పికెట్)ను కంగుతినిపించింది. సెమీఫైనల్లో సెయింట్ పాల్స్ 16–12తో లిటిల్ ఫ్లవర్ జట్టుపై, కేవీ పికెట్ 20–15తో డైర్ వోల్వస్‌పై నెగ్గాయి. పురుషుల తుదిపోరులో ఈగల్ 52–44తో ఎయిర్ బౌర్న్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో ఈగల్ 40–35తో బెంచ్ వార్మర్స్ యునైటెడ్‌పై, ఎయిర్ బౌర్న్ 45–40తో ఎన్‌పీఏపై గెలిచాయి. వైఎంసీఏ కార్యదర్శి లియోనార్డ్ మైరాన్, కిరణ్ కుమార్ విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు.