Basket ball tourney
-
ఫ్యూచర్ కిడ్స్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: జీఎం సంపత్ కుమార్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టు డబుల్ ధమాకా మోగించింది. బాలబాలికల విభాగాల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఏలో ముగిసిన ఈ టోర్నమెంట్లో బాలుర ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 69–66తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. ఫ్యూచర్ కిడ్స్ తరఫున అఖిల్ (15 పాయింట్లు), సుభాష్ (14 పాయింట్లు), అద్యన్ (14 పాయింట్లు) రాణించారు. చిరెక్ జట్టు తరఫున కొఠారి (24 పాయింట్లు), ధ్రువ్ (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బాలికల విభాగం ఫైనల్లో ఫ్యూచర్స్ కిడ్స్ జట్టు 54–51తో శ్రీనిధి స్కూల్ జట్టును ఓడించింది. ప్యూచర్ కిడ్స్ తరపున శ్రేయ (18 పాయింట్లు), అదితి (20 పాయింట్లు), బృంద (8 పాయింట్లు) మెరిపించారు. శ్రీనిధి జట్టు తరఫున మేఘన (16 పాయింట్లు), సి. మేఘన (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన బాలుర సెమీఫైనల్స్‌లో ఫ్యూచర్ కిడ్స్ 78–56తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై, చిరెక్ స్కూల్ 78–69తో లిటిల్ ఫ్లవర్ (ఉప్పల్) జట్టుపై గెలిచాయి. బాలికల సెమీఫైనల్స్‌లో ప్యూచర్ కిడ్స్ 42–28తో రెక్వాల్‌ఫోర్డ్ స్కూల్‌పై, శ్రీనిధి 38–34తో ఫ్యూచర్ కిడ్స్ ‘బి’ జట్టుపై విజయం సాధించాయి. విజేత జట్లకు జాతీయ మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ రామచంద్ర ట్రోఫీలను అందజేశారు. -
క్వార్టర్స్‌లో చిరెక్ స్కూల్ జట్లు
సాక్షి, హైదరాబాద్: రెవరెండ్ ఫ్రాన్సిస్ దేవసియా బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో చిరెక్ బాలబాలికల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెయింట్ ఫ్యాట్రిక్స్ స్కూల్ వేదికగా శుక్రవారం జరిగిన బాలుర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 39–19తో డాన్బాస్కోపై గెలుపొందింది. చిరెక్ తరఫున అర్జున్ 17 పాయింట్లతో సత్తా చాటాడు. శౌర్య (12) ఆకట్టుకున్నాడు. డాన్‌బాస్కో జట్టులో యేసు 12 పాయింట్లు సాధించాడు. బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 28–14తో సెయింట్ ఆంథోనీస్ బాలికల హైస్కూల్‌ను చిత్తుగా ఓడించింది. విజేత జట్టులో శ్రీయ (8), అనుష్క (4) రాణించారు. ఇతర బాలుర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆతిథ్య సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ (రేహాన్ 12, జేమ్స్8) 28–12తో సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ (లోహిత్ 8)పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (రోహన్ 13, రాఘవ్ 6) 30–29తో సెయింట్ పాల్స్ హైస్కూల్ (ఆంథోని 17)పై, ఫ్యూచర్‌కిడ్స్ (ఆద్యన్ 12, అనిశ్ 12) 39–18తో ఆల్‌సెయింట్స్ (వర్మ 8)పై, ఓక్రిడ్జ్ (రిషి 13, ఫరీద్ 7) 40–33తో ఎంజీఎం హైస్కూల్ (శ్రవణ్ 13, ఖాదిర్ 8)పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ (బనియెల్ 23, శశాంక్ 6) 37–16తో జాన్సన్ గ్రామర్ స్కూల్ (హర్షిత్ 8, కపిల్ 6)పై, జాన్సన్ గ్రామర్ ఐసీఎస్ఈ (విష్ణు 8, సూర్య 8) 29–20తో గంగాస్వ్యాలీ (రితీష్ 11, కౌన్షిక్ 7)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు ఓక్రిడ్జ్ న్యూటన్ (మేఘన 22) 24–20తో డాన్‌బాస్కో (సారా 17)పై, సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ (యశస్విని 4, రాగమయి 4) 19–6తో ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌పై, ఓక్రిడ్జ్ (స్వాతి 12) 20–9తో భారతీయ విద్యాభవన్ (స్నిగ్ధ 7)పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హర్షిత 17, కీర్తన 6) 35–13తో సెయింట్పాయ్స్ హైస్కూల్ (శ్రావ్య 4, తేజశ్రీ 4)పై, గీతాంజలి దేవ్‌శాల (తన్విత 8, జోషిక 6) 16–11తో గంగాస్ వ్యాలీ (సిధిక 7)పై గెలుపొందాయి. -
విజేతలు ఎంఎల్ఆర్ఐటీ, సెయింట్ ఫ్రాన్సిస్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్ (ఐసీబీఎల్)లో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ), సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్లు విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠ రేకెత్తించిన పురుషుల ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటీ 87–86తో లయోలా అకాడమీపై విజయం సాధించింది. చివరి సెకనులో క్రిస్ వీరేశ్ సాధించిన పాయింట్‌తో ఎంఎల్ఆర్ఐటీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా ఎంఎల్ఆర్ఐటీ 83–86తో వెనుకబడింది. అయితే ఒత్తిడిని అధిగమించిన ఆటగాళ్లు వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోరు 86–86తో సమమైంది. మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది. అయితే ఈ దశలో అద్భుతం చేసిన క్రిస్ వీరేశ్ (23 పాయింట్లు) చివరి సెకనులో బంతిని బాస్కెట్లో వేసి జట్టుకు విజయాన్నందించాడు. దినేశ్ కుమార్ (13 పాయింట్లు), పథ్వీ కుమార్ (12 పాయింట్లు) వీరేశ్‌కు చక్కగా సహకరించారు. లయోలా అకాడమీ జట్టులో సల్మాన్ ఖాన్ (25 పాయింట్లు), సాయి కుమార్ (17 పాయింట్లు), డేవిడ్ (15 పాయింట్లు) ఆకట్టుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వీఎన్ఆర్ వీజేఐఈటీ 77–54తో భవన్స్ సైనిక్‌పురిపై నెగ్గింది. మహిళల టైటిల్ పోరులో సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్టు 63–49తో లయోలా అకాడమీపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున మావ్‌జీత్ (24), రచన (19), అర్చన (14) దూకుడుగా ఆడారు. లయోలా జట్టులో మానస (20), శరణ్య (10) పోరాడారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన మహిళలు, పురుషుల జట్లు ఆలిండియా ఐసీబీఎల్ టోర్నీకి అర్హత సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు, రన్నరప్‌కు రూ. 15 వేలు నగదు బహుమతిగా లభించగా... మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ అధ్యక్షుడు జయకర్ డేనియల్ పాల్గొన్నారు. -
సెయింట్ ఫ్రాన్సిస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ వైఎంసీఏ ఓపెన్ 3–3 మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 18–14తో కేబీసీ జట్టుపై విజయం సాధించింది. విజేత జట్టు తరఫున అమిత డేనియల్ 12 పాయింట్లతో చెలరేగింది. కేబీసీ తరఫున రచన (8), మానస (6) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో కేబీసీ 12–6తో ఫిబాపై, సెయింట్ ఫ్రాన్సిస్ 16–15తో సెయింట్ పాయ్స్పై గెలుపొందాయి. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 17–14తో సెయింట్ ప్యాట్రిక్స్‌పై, ఫిబా 13–7తో రాకెట్స్‌పై, సెయింట్ పాయ్స్ 15–8తో లయోలా అకాడమీపై, కేబీఎస్ 17–14తో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్‌పై విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి ఎస్. హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతిని అందజేశారు. విజేతగా నిలిచిన సెయింట్ ఫ్రాన్సిస్ జట్టుకు రూ. 3000, రన్నరప్ కేబీసీ జట్టుకు రూ. 2000 ప్రైజ్‌మనీగా లభించాయి. -
బెంచ్ వార్మర్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లబ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో బెంచ్ వార్మర్స్ జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. సికింద్రాబాద్ క్లబ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో బెంచ్ వార్మర్స్ 64–46తో వైఎంసీఏ సికింద్రాబాద్‌పై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత జట్టు తరఫున గోపి 22 పాయింట్లతో చెలరేగగా, రోహిత్ (19 పాయింట్లు), శ్రీకాంత్ (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. వైఎంసీఏ జట్టులో పీటర్ (14), వీరేశ్ (10), పృథ్వీ (10) రాణించారు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో బెంచ్ వార్మర్స్ 64–62తో సికింద్రాబాద్ క్లబ్‌పై గెలుపొందగా, సికింద్రాబాద్ వైఎంసీఏ 60–57తో ఎయిర్‌బార్న్ క్లబ్‌ను ఓడించింది. -
ఇండస్ స్కూల్ జట్లు శుభారంభం
సీబీఎస్ఈ క్లస్టర్ బాస్కెట్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా సికింద్రాబాద్‌లో జరిగిన బాస్కెట్‌బాల్ ఈవెంట్లో ఆతిథ్య ఇండస్ యూనివర్సల్ స్కూల్ జట్లు శుభారంభం చేశాయి. అండర్–19 బాలుర విభాగంలో ఇండస్ స్కూల్ జట్టు (తెలంగాణ) 33–13తో నలంద విద్యానికేతన్ (ఏపీ)పై గెలుపొందింది. విజేత జట్టులో తరుణ్ (10), ధరణ్ (8) ఆకట్టుకున్నారు. ఇతర మ్యాచ్‌ల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ (తెలంగాణ) 44–3తో ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ (ఏపీ)పై, సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (తెలంగాణ) 21–9తో కేకేఆర్ హ్యాపీ వ్యాలీ (ఏపీ)పై, సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ (తెలంగాణ) 32–9తో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (తెలంగాణ)పై గెలుపొందాయి. మరోవైపు అండర్–17 బాలుర విభాగంలోనూ ఇండస్ యూనివర్సల్ స్కూల్ 25–7తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (తెలంగాణ)ను ఓడించి ముందంజ వేసింది. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సివిల్ సప్లయ్స్ కమిషనర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి బాస్కెట్‌బాల్ టోర్నీని ప్రారంభించారు. బాస్కెట్‌బాల్‌తో పాటు గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీబీఎస్ఈ క్లస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. డీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ ఈవెంట్‌ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు. అండర్–17 బాలుర ఫలితాలు: హెచ్‌పీఎస్ రామంతపూర్ 28–2తో విస్టా స్కూల్ (ఏపీ)పై, నవభారత్ పబ్లిక్ స్కూల్ (తెలంగాణ) 10–2తో మహారిషి విద్యా మందిర్ (తెలంగాణ)పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఖాజాగూడ (తెలంగాణ) 23–4తో ఓబుల్‌రెడ్డి (తెలంగాణ) స్కూల్‌పై, జాన్సన్ గ్రామర్ స్కూల్ (తెలంగాణ) 44–14తో టైమ్ స్కూల్ (తెలంగాణ)పై, మెరిడియన్ స్కూల్ మాదాపూర్ (తెలంగాణ) 14–2తో సుప్రభాత్ మోడల్ స్కూల్ (తెలంగాణ)పై, ఒయాసిస్ స్కూల్ (తెలంగాణ) 24–8 ది గౌడియం స్కూల్ (తెలంగాణ)పై, భారతీయ విద్యాభవన్ (తెలంగాణ) 41–11తో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్ (ఏపీ)పై, పల్లవి మోడల్ స్కూల్ (తెలంగాణ) 28–5తో ఓపెన్ మైండ్స్ బిర్లా స్కూల్ (తెలంగాణ)పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి) 17–16తో భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయ (సైనిక్‌పురి)పై, డీపీఎస్ (వరంగల్) 18–4తో ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించాయి. -
హైదరాబాద్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. జగిత్యాలలో జరిగిన ఈ టోర్నమెంట్లో రెండు విభాగాల్లోనూ డిఫెండింగ్ చాంపియన్స్ రంగారెడ్డి, కరీంనగర్‌లను ఓడించి టైటిళ్లను గెలుచుకున్నాయి. బాలుర ఫైనల్లో హైదరాబాద్ 45–12తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందగా, బాలికల ఫైనల్లో హైదరాబాద్ 30–15తో కరీంనగర్‌ను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో వరంగల్ 38–27తో నిజామాబాద్‌పై, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ 30–20తో రంగారెడ్డిపై గెలుపొందాయి. -
లయోలా, సెయింట్ పాల్స్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎంసీఏ నిర్వహించిన ఇండిపెండెన్స్ కప్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో లయోలా కాలేజీ, సెయిం ట్ పాల్స్ స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. సికింద్రాబాద్ వైఎంసీఏ మైదానం లో జరిగిన మహిళల ఫైనల్లో లయోలా జట్టు 36–20 స్కో రుతో సెయింట్ పాయిస్పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సెయింట్ పాయిస్ 31–25తో బ్లూ క్రూసేడర్స్పై గెలిచింది. బాలుర ఈవెంట్లో సెయింట్ పాల్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో సెయింట్ పాల్స్ 34–33తో కేంద్రీయ విద్యాలయ (కేవీ, పికెట్)ను కంగుతినిపించింది. సెమీఫైనల్లో సెయింట్ పాల్స్ 16–12తో లిటిల్ ఫ్లవర్ జట్టుపై, కేవీ పికెట్ 20–15తో డైర్ వోల్వస్పై నెగ్గాయి. పురుషుల తుదిపోరులో ఈగల్ 52–44తో ఎయిర్ బౌర్న్పై విజయం సాధించింది. సెమీస్‌లో ఈగల్ 40–35తో బెంచ్ వార్మర్స్ యునైటెడ్‌పై, ఎయిర్ బౌర్న్ 45–40తో ఎన్‌పీఏపై గెలిచాయి. వైఎంసీఏ కార్యదర్శి లియోనార్డ్ మైరాన్, కిరణ్ కుమార్ విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు.