సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లబ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో బెంచ్ వార్మర్స్ జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. సికింద్రాబాద్ క్లబ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో బెంచ్ వార్మర్స్ 64–46తో వైఎంసీఏ సికింద్రాబాద్‌పై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది.
విజేత జట్టు తరఫున గోపి 22 పాయింట్లతో చెలరేగగా, రోహిత్ (19 పాయింట్లు), శ్రీకాంత్ (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. వైఎంసీఏ జట్టులో పీటర్ (14), వీరేశ్ (10), పృథ్వీ (10) రాణించారు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో బెంచ్ వార్మర్స్ 64–62తో సికింద్రాబాద్ క్లబ్‌పై గెలుపొందగా, సికింద్రాబాద్ వైఎంసీఏ 60–57తో ఎయిర్‌బార్న్ క్లబ్‌ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment