hyedarabad
-
7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు అంచనా. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, నిర్మాణాల కూల్చివేతలకు ఆటంకం వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే అడ్డంకులన్నీ తొలగిపోయి డీపీఆర్ సహా అన్ని పనులు పూర్తయినప్పటికీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించి, బడ్జెట్లోనూ నిధులు కేటాయించింది. డ్రోన్ సర్వే... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం గత ఆగస్టులో డ్రోన్ సర్వే నిర్వహించారు. దారుల్షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 103 మతపరమైన, ఇతర సున్నితమైన కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు లు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ ద్వారా సేకరించిన డేటా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా వరకు మె ట్రో రైలు అందుబాటులోకి వస్తే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించవచ్చు. అలాగే, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ వీక్షించే అవకాశం ఉంటుంది. ఐదు స్టేషన్లు: ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి దారు షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్ను మా వరకు ఈ 5.5 కి.మీ. అలైన్మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తరువాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. -
సెయింట్ పాల్స్ స్కూల్లో ‘గోల్డెన్ జూబ్లీ’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్లో పదోతరగతి(1973 బ్యాచ్) చదివి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఆదివారం ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులతా పాఠశాల ప్రాంగణంలో ఒకచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్ కోఆర్డినేటర్ వీరస్వామి మాట్లాడుతూ తమ బ్యాచ్‌లో 140 మంది విద్యార్థులుండగా, 75మంది వస్తారని అనుకున్నామని, 62 మంది గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. అమెరికా, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఒకరు కోల్‌కతా నుంచి రావడం ఆనందంగా ఉందన్నారు. కమిటీ ప్రతినిధులు కెబీఎంఎం.క్రిష్ణ, వి.కిషోర్, కోకా వెంకటరమణ, వి.రమేష్ పాల్గొన్నారు. గురువులకు సన్మానం విద్యాబుద్ధులు నేర్చిన తొమ్మిది మంది గురువులు, ప్రస్తుత ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మజర్అలీ అహ్మద్‌ను 1973 బ్యాచ్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి రూ. 40 లక్షలు విరాళం 1973 బ్యాచ్‌కు చెందిన ప్రొఫెసర్ సుధాకర్, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చల్లా కిషోర్, అతని నలుగురు సోదరులతో కలిసి పాఠశాల కొత్త భవనం కోసం రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు. -
అదరగొట్టిన అక్షత్ రెడ్డి
తిరునల్వేలి: హైదరాబాద్ ఓపెనర్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి రంజీ మ్యాచ్‌లో రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అక్షత్ (477 బంతుల్లో 248 బ్యాటింగ్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా రెండో రోజు మంగళవారం ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 523 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అక్షత్‌కు అండగా నిలిచిన బావనక సందీప్ (221 బంతుల్లో 130; 15 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అక్షత్‌తో పాటు సీవీ మిలింద్ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 249/3తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను తమిళనాడు బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా 174 బంతుల్లో సందీప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 316 బంతుల్లో అక్షత్ 150 పరుగుల మైలురాయిని దాటాడు. చివరకు లంచ్‌కు ముందు సందీప్‌ను మొహమ్మద్ ఔట్ చేయడంతో 246 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొల్లా సుమంత్ (5), ఆకాశ్ భండారి (17) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే సాకేత్ సాయిరామ్ (42) కెప్టెన్‌కు సహకరించాడు. టీ విరామ సమయానికి 199 పరుగుల వద్ద ఉన్న అక్షత్... చివరి సెషన్ ఆరంభం కాగానే ఫోర్ కొట్టి 413 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అక్షత్, సాయిరామ్ ఏడో వికెట్‌కు 109 పరుగులు జత చేశారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువ. -
సమస్యల్లో కేజీబీవీ టీచర్లు
సకాలంలో అందని వేతనాలు కనీస వసతులు కరువే డిమాండ్ల సాధనకు టీచర్ల పోరాటం 4న హైదరాబాద్‌లో మహాధర్నా నిజామాబాద్ అర్బన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం కొన్నేళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా, వారి మొర అలకించిన వారు, సమస్యలు తీర్చిన వారే లేరు. రాత్రింబవళ్లు విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్లకు సరైన సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతనాల సమస్య వేధిస్తూనే ఉంది. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కేజీబీవీ టీచర్లు యూనియన్‌గా ఏర్పడి డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ, 4వ తేదీన హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 36 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. పదవ తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉంటున్నారు. వీరికి కేజీబీవీ టీచర్లు మెరుగైన విద్య, వసతులు అందిస్తూ సక్రమంగా చూసుకుంటున్నారు. కేజీబీవీలు చాలా చోట్ల ఊరికి దూరంగా ఉండడం, ప్రధానంగా మహిళా టీచర్లు కావడంతో కేజీబీవీలో ఉండేందుకు, వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె ఇళ్లలో కొనసాగుతున్న కేజీబీవీల్లో సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న వీరికి రూ.14 వేల వేతనం ఇస్తున్నారు. అది కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. – వివిధ శాఖలలో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లే కేజీబీవీ టీచర్లను కూడా క్రమబద్ధీకరించాలి. – పదో పీఆర్సీ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్ల వేతనం రూ.37 వేలు, ఉపాధ్యాయుల వేతనం రూ.28 వేలు, పీఈటీలకు రూ.22 వేలు, అకౌంటెంట్‌కు రూ.20 వేలు, ఏఎన్ఎంకు రూ.18 వేల మేర పెంచాలి. – ఆకస్మిక సెలవులు 20, ప్రత్యేక ఆసస్మిక సెలవులు 7 మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. – వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. – హెల్త్‌కార్డుల మంజూరీతో పాటు వేసవి సెలవుల్లోనూ వేతనం ఇవ్వాలి.