Vijayakrishna
-
యాభై వసంతాల వేడుక
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేశ్ విజయకృష్ణ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో విజయకృష్ణ మందిర్–ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తి వనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘ఈ పార్క్ గతం, భవిష్యత్ తరానికి మధ్య అద్భుతమైన వారధి’’ అన్నారు. ‘‘చిత్ర పరిశ్రమ కోసం కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా స్ఫూర్తి వనం రూపొందించాం’’ అని నరేశ్ విజయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నరే‹శ్ విజయకృష్ణ, పవిత్రా లోకేశ్, జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని, ఖుష్బూ తదితరులు సత్కరించారు. న్యాయమూర్తి ఎన్. మాధవరావు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్, నటులు సాయి దుర్గా తేజ్, మనోజ్ మంచు, అలీ, దర్శకులు మారుతి, అనుదీప్, సతీష్ వేగేశ్న, సంగీత దర్శకుడు కోటి, నిర్మాతలు శరత్ మరార్, రాధామోహన్తో పాటు తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
సాధారణ డిగ్రీతో పాటు ఉపాధి కోర్సులు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు, ఉపాధి కల్పించే కోర్సులను అనుసంధానం చేసినట్టు యూనివర్సీటీ సహాయ సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ వచ్చిన ఆయన ఆదివారం మద్దిలపాలెం డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో గల ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ డిగ్రీ కోర్సులకు అదనంగా, ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను జోడించినట్టు తెలిపారు. దీని ద్వారా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పైచదువులతో పాటు, ఉపాధి పొందేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై విధిగా సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు ఉపాధి కోర్సును ఓ పాఠ్యాంశంలా చదవాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా 2022–23 విద్యా సంవత్సరానికి సంబం«ధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఫీజులను కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. స్టడీ మెటీరియల్‌ను స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థుల చిరునామాలకు పంపుతామని చెప్పారు. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీఆర్ఓయూఆన్లైన్.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఇంటర్.. దానికి సమాన విద్యార్హతగల వారు డిగ్రీలో జాయిన్ కావచ్చునన్నారు. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్ అవకాశం కల్పించినట్టు తెలిపారు. 1999 తర్వాత అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులకు, 2005 తర్వాత అడ్మిషన్ తీసుకున్న పీజీ విద్యార్థులకు ఆయా కోర్సులు పూర్తి చేసుకోవడానికి రీ అడ్మిషన్ ఇస్తున్నట్టు విజయకృష్ణారెడ్డి వివరించారు. -
అదే ఫాలో అవుతున్నా.. అందుకే ఇప్పటికీ టాప్‌లో ఉన్నాను : నరేశ్
Naresh VK actor: ‘‘విజయకృష్ణ మూవీస్’ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతోంది. ఈ బ్యానర్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలనుకుని ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని నటుడు నరేశ్ విజయకృష్ణ అన్నారు. నేడు (జనవరి 20) తన పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదు. 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో తెరంగేట్రం చేశాను. నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణానికి కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్లకు, నా గురువు జంధ్యాలకి థ్యాంక్స్. యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు ఇస్తున్న రచయితలు, దర్శక–నిర్మాతలకు, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవ, రెండేళ్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభివృద్ధి కోసం కృషి చేశాను. ఈ ఏడాది అమ్మ పేరుతో (విజయ నిర్మల) స్టూడియోను అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ‘నాలుగు స్థంభాలాట’ సమయంలో ‘గౌరవం నువ్వు ఆశించకు.. అందరికీ ఇవ్వు’ అని మా అమ్మ చెప్పారు.. నేను అదే ఫాలో అవుతుండటం వల్లే ఇంకా టాప్‌లో ఉన్నాను. ఓటీటీ వచ్చినా థియేటర్ అనుభూతే వేరు. ప్రస్తుతం రామ్‌చరణ్–శంకర్ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్తో పాటు నవీన్ పొలిశెట్టి సినిమా చేస్తున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఇండస్డ్రీ, ఏపీ ప్రభుత్వం (టికెట్ ధరలు, ఇతర ఇండస్ట్రీ సమస్యలను ఉద్దేశించి) మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో విజయకృష్ణ అంత్యక్రియలు
తిరువూరు, న్యూస్‌లైన్ : చెన్నైలో మృతిచెందిన అస్సాంలోని భోజ్‌పూర్ డీఐజీ రామిశెట్టి విజయకృష్ణ అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన తిరువూరులో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో శనివారం మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని అంబులెన్సులో తిరువూరు తీసుకొచ్చారు. రిటైర్డు అటవీ అధికారి రామిశెట్టి శ్రీరాములు రెండో కుమారుడైన విజయకృష్ణ మృతదేహానికి జాతీయ పతాకం కప్పి, పూలమాలలు వేసి ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్మాన్సింగ్, అస్సాం అడిషనల్ డీఐజీ అనురాగ్ అగర్వాల్, ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు మహేష్లడ్డా, అజయ్‌కుమార్ విక్రమ్, చెన్నై మీడియా చీఫ్ మయూరీ సిన్హా, అడిషనల్ డీజీపీ చంద్రనాథ్, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కంచి రామారావు నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు విజయకృష్ణ మృతదేహానికి తిరువూరు సమీపంలోని మామిడితోటలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. విజయకృష్ణ తండ్రి రామిశెట్టి శ్రీరాములు చితికి నిప్పంటించారు. పట్టణ ప్రధానవీధుల్లో ప్రత్యేక వాహనంపై ఉంచిన విజయకృష్ణ మృతదేహాన్ని అంతిమయాత్ర నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రిటైర్డు ఉద్యోగులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. శోకసంద్రమైన తిరువూరు... అందరికీ చిరపరిచితులైన రిటైర్డు అటవీ అధికారి రామిశెట్టి శ్రీరాములు రెండో కుమారుడు, అస్సాం కేడర్ ఐపీఎస్ అధికారి రామిశెట్టి విజయకృష్ణ (43) మృతితో తిరువూరులో విషాదం అలుముకుంది. చెన్నై నుంచి విజయకృష్ణ మృతదేహాన్ని తిరువూరు తీసుకువస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న వెంటనే పలు ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులు ఆయన నివాసానికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. విజయకృష్ణ భార్య లీలారాణి, కుమారులు శ్రీరాం, బలరాంతేజ్ను పోలీసు ఉన్నతాధికారులు ఓదార్చారు.