
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఎమ్‌ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అమ్మకు గుడి కట్టడంతో నా పని అయిపోలేదు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే విజయకృష్ణ మూవీస్‌ను రీ లాంఛ్ చేశాను. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన డర్టీ హరి చూసి ఫ్యాన్ అయిపోయాను. మూడేళ్ల నుంచి రాజుగారితో ప్రయాణిస్తున్నాను. టీజర్, ట్రైలర్‌లో కంటే సినిమాలో ఇంకా మంచి కంటెంట్ ఉంది. అమ్మానాన్న కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్‌లో వచ్చిన మళ్లీ పెళ్లి సినిమా టైటిల్‌నే మా సినిమాకు వాడుకున్నాం' అన్నాడు నరేశ్.
నటి పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ.. 'నటీనటులను పాంపర్ చేసే దర్శకుడు ఎంఎస్ రాజు. ఆయన ఒక అన్నగా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సినిమాలో నా పాత్రకు వంద శాతం న్యాయం చేశాననుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, ప్రవీణ్ యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment