Actor Naresh Gives Clarity On His Marriage Video With Pavitra Lokesh, Deets Inside - Sakshi
Sakshi News home page

Naresh- Pavitra: పెళ్లిపై స్పందించిన నరేశ్.. ఏమన్నారంటే?

Published Fri, Mar 10 2023 6:45 PM | Last Updated on Fri, Mar 10 2023 8:24 PM

Actor Naresh Clarity On His Marriage Video With Pavitra Lokesh - Sakshi

ఉదయం నుంచి నరేశ్- పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. అయితే తాజాగా ఆ ట్రెండింగ్ పెళ్లి వీడియోపై సినీ నటుడు నరేశ్‌ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలు మీతో చెబుతానంటూ వివరణ ఇచ్చారు.  'ఇంటింటి రామాయణం' మూవీ సమావేశంలో పాల్గొన్న నరేశ్ 'మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 

త్వరలోనే వెల్లడిస్తా..

నరేశ్ మాట్లాడుతూ..  ‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. నాకు రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్ కూడా ఉంది.  త్వరలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి వరకు కాస్తా ఓపిక పట్టండి. ఇప్పుడు నేను మాట్లాడితే ‘ఇంటింటి రామాయణం ప్రమోషన్స్‌పై ప్రభావం పడుతుంది. ’అని అన్నారు.

అసలేం జరిగిందంటే...

కాగా..  నరేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో 'ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రా-నరేశ్‌' అని పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. సమ్మోహనం చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్‌ - పవిత్ర ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి.  అంతే కాకుండా కొత్త ఏడాదిలో స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్‌ 31న నరేశ్‌ షేర్‌ చేసిన వీడియో ఆ వార్తలకు మరింత ఊతమిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement