
టాలీవుడ్‌లో నరేశ్, పవిత్ర లోకేశ్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ జంట చాలాసార్లు వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ జంట గురించి రకరకాలుగా వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత నరేశ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇటీవలే మళ్లీ పెళ్లి చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నరేశ్.. పవిత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
(ఇది చదవండి: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల)
ప్రస్తుతం ఆయన 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన పవిత్ర లోకేశ్ గురించిన ఆసక్తికర కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో పవిత్ర భోజనం తీసుకొచ్చేదని అన్నారు. ఈ ఈవెంట్‌లో కొన్ని ఫోటోలు కెమెరాల్లో బంధించగా.. అదే సమయంలో కెమెరా నరేశ్ ఫోన్‌ను క్లిక్ మనిపించింది. ఆయన ఫోన్‌లో వాల్ పేపర్‌గా నరేశ్, పవిత్ర ఫోటో కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందోనని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. నరేశ్.. తన మూడో భార్యతో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే)
Comments
Please login to add a commentAdd a comment