‘‘వినోదం, భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో రూపొందిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ చిత్రకథ సమాజానికి అద్దం పడుతుంది’’ అని నటి పవిత్రా లోకేష్ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. వీకే నరేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది.
ఈ సందర్భంగా పవిత్రా లోకేష్ మాట్లాడుతూ– ‘‘ఎమ్మెస్ రాజుగారు ‘మళ్ళీ పెళ్లి’లో నరేశ్‌గారు, నేను నటిస్తేనే బాగుంటుందనడంతో చేశాం. మళ్ళీ పెళ్ళి అంటే సమాజం ఇప్పటికీ తక్కువగానే చూస్తుంది. ఇదొక్కటే కాదు.. సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. మా విషయంలో (నరేశ్–పవిత్ర) కొన్ని సంఘటనలు జరిగాయి.
(చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?)
కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు..నా వెనుక బలంగా నిల్చున్నారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనకి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా ఉన్నారు. విజయ నిర్మల, కృష్ణగార్లతో పాటు మహేశ్‌బాబుగారిని కూడా కలిశాను. ఆ ఫ్యామిలీ మమ్మల్ని (నరేశ్–పవిత్ర) యాక్సెప్ట్ చేసింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment