Naresh And Pavitra Lokesh New Film Malli Pelli Announced - Sakshi
Sakshi News home page

Naresh - Pavitra Lokesh: నరేశ్‌- పవిత్రల మళ్లీ పెళ్లి.. ఇదీ అసలు సంగతి!

Published Fri, Mar 24 2023 1:08 PM | Last Updated on Fri, Mar 24 2023 4:43 PM

Actor Naresh Shares Malli Pelli Poster Released - Sakshi

నటుడు నరేశ్‌, పవిత్రలు పెళ్లి చేసుకున్నారంటూ ఓ వీడియో తెగ వైరలయిన సంగతి తెలిసిందే! ఇద్దరూ లిప్‌ కిస్‌ ఇచ్చుకున్న ఫోటో కూడా తెగ చక్కర్లు కొట్టింది. వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని గతంలోనే ప్రకటించడంతో నిజంగానే వీరి పెళ్లి అయిపోయిందనుకున్నారంతా! కానీ కొందరు మాత్రం ఇది రియల్‌ పెళ్లిలా లేదే? రీల్‌ పెళ్లిలా ఉందే! అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వారి అనుమానమే నిజమైంది. నరేశ్‌- పవిత్రల పెళ్లి సినిమా ప్రమోషన్స్‌లో భాగమేనని రుజువైంది.

పవిత్రతో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేసినట్లు వెల్లడించాడు నరేశ్‌. ఈ చిత్రం వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్‌, వీడియో గ్లింప్స్‌ రిలీజ్‌ చేశాడు. తెలుగులోనే కాకుండా కన్నడలోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు చావు దెబ్బ కొట్టావ్‌.. నీ పని బాగుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement