టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయనుండగా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నరేశ్, పవిత్రా లోకేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!)
నరేశ్ మాట్లాడుతూ.. 'మళ్లీ పెళ్లి అనే సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించింది కాదు. సమాజంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్లే వివాహ వ్యవస్థ ప్రస్తుతం దెబ్బతింటోంది. వివాహాబంధంపై గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. సోషల్‌మీడియాలో మాపై విమర్శలు వచ్చాయి. రివెంజ్ కోసమే సినిమా చేశానన్నారు. ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్‌లో వీడియోలు షేర్ చేయవచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లై చేశా. ఆ తర్వాత మా ఇద్దరి బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటా’ అని అన్నారు.
(ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్)
పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' ఓ సినిమా షూటింగ్‌లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. ఏ విషయంలోనైనా పాజిటివ్‌గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. నరేశ్ నాకు అండగా నిలబడ్డారు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment